News November 18, 2025
AIFB రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి కన్నుమూత

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. కాగా, ఆయన ఏడాదిగా క్యాన్సర్‌తో పోరాడారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇక సురేందర్ రెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు ఆకర్షితులై తన జీవితకాలం మొత్తం AIFBలోనే కొనసాగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమించారు.
Similar News
News November 18, 2025
చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.

ఆర్జే రత్నాకర్ ఎవరు?

పుట్టపర్తి సత్యసాయి బాబా సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా వినిపించే పేరు ఆర్జే రత్నాకర్. ఆయన బాబా తమ్ముడు జానకిరామయ్య కుమారుడు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ట్రస్ట్ కార్యకలాపాల పారదర్శకత, సేవల విస్తరణ, విద్యా–ఆరోగ్య సేవల బలోపేతంపై తనదైన ముద్ర వేస్తున్నారు. ట్రస్ట్ నిర్వహణలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. 1972లో ఈ ట్రస్ట్ ప్రారంభమైంది.