News December 17, 2025
AIIMS నాగపూర్‌లో ఉద్యోగాలు

<
Similar News
News December 18, 2025
క్లౌడ్, ఆన్‌లైన్ లైబ్రరీలో భూ రికార్డులు: CBN

AP: భూ రికార్డుల ఆర్కైవ్స్‌నూ మేనేజ్ చేస్తున్నారని వీటికి చెక్ పెట్టాల్సిన అవసరముందని CM CBN అభిప్రాయపడ్డారు. అన్ని భూ రికార్డులు క్లౌడ్ స్టోరేజీలో ఉంచడం మంచిదని కలెక్టర్ల సదస్సులో సూచించారు. రికార్డులు ఆన్‌లైన్ లైబ్రరీలో ఉంచితే మ్యానిపులేషన్‌కు తావుండదన్నారు. 3 మెంబర్ కమిటీ సూచించిన 6 పద్ధతులు గేమ్ ఛేంజర్లు అవుతాయని చెప్పారు. సంస్కరణల వల్ల 10 ని.లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోందన్నారు.
News December 18, 2025
పట్టు రైతులకు రూ.14 కోట్లు విడుదల

AP: రాష్ట్రంలో పట్టు పరిశ్రమపై ఆధారపడిన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించి సిల్క్ సమగ్ర-2 పథకంలో భాగంగా రాష్ట్ర వాటా కింద రూ.14 కోట్ల నిధుల్ని పట్టు పరిశ్రమల శాఖకు విడుదల చేశామని మంత్రి వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 13,663 మంది పట్టు రైతులకు లబ్ధి చేకూరినట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు.
News December 18, 2025
రేషన్ కార్డుదారులకు అలర్ట్

TG: రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. లేదంటే కొత్త సంవత్సరంలో సన్న బియ్యం కోటా నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేసింది. కార్డుల్లో ఉన్న వారు రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలు వేసి కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పింది. ఐదేళ్ల లోపు పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.


