News February 28, 2026

AIIMS న్యూఢిల్లీలో 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

AIIMS-CAPFIMS న్యూఢిల్లీ 100 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు మార్చి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DNB/DrNB, MD/MS/DM/MCh అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.aiims.edu/

Similar News

News April 15, 2026

డీలిమిటేషన్.. సరిహద్దులను ఎలా నిర్ణయిస్తారు?

image

డీలిమిటేషన్‌తో దేశంలో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త, పాత నియోజకవర్గాల సరిహద్దులను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. నదులు, కొండలు వంటి సహజ సరిహద్దులు, జిల్లాల బార్డర్స్, రవాణా, పరిపాలనా సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రతి సీటులో సమాన సంఖ్యలో జనాభా ఉండేలా, అసెంబ్లీ సెగ్మెంటు ఏదో ఒక పార్లమెంటు పరిధిలోకి వచ్చేలా చూస్తుంది. SC, ST జనాభా ఎక్కువున్న చోట రిజర్వేషన్ కల్పిస్తుంది.

News April 15, 2026

నేడే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

image

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 10.31 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. స్టూడెంట్స్ మన Way2newsలో సూపర్ ఫాస్ట్‌గా, సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే వచ్చే స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో మార్కుల లిస్ట్ ప్రత్యక్షమవుతుంది.
* ALL THE BEST

News April 15, 2026

హార్ముజ్ బ్లాక్.. ఇరాన్‌కు ఎంత నష్టమంటే?

image

పశ్చిమాసియాకు అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని <<19639152>>యుద్ధ నౌకలతో<<>> అమెరికా బ్లాక్ చేయడం తెలిసిందే. ఇరాన్ పోర్టులకు వచ్చే, వెళ్లే నౌకలపై ఆంక్షలు పెట్టింది. దీంతో ఇరాన్‌కు రోజూ 435 మిలియన్ డాలర్ల(రూ.4 వేల కోట్లు) నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. దిగ్బంధనం లేని ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన 154 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉందని Kpler తెలిపింది. ఆ క్రూడ్‌ను ఎగుమతి చేసేందుకు ఛాన్స్ ఉంది.