News January 16, 2026

AIIMS రాయ్‌పూర్‌‌లో ఉద్యోగాలు

image

AIIMS రాయ్‌పూర్‌ 40 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 19న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. MBBS ఉత్తీర్ణతతో పాటు DMC/NMC/స్టేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in

Similar News

News February 5, 2026

అణు ఒప్పందంపై ఇరాన్, అమెరికా చర్చలకు డేట్ ఫిక్స్

image

అణు ఒప్పందంపై చర్చించేందుకు ఇరాన్, యూఎస్ ప్రతినిధుల భేటీకి తేదీ ఖరారైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మస్కట్‌లో చర్చలు జరగనున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ ట్వీట్ చేశారు. అంతకుముందు అణు ఒప్పందానికి రాకపోతే దాడి తప్పదని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. దీనికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఘాటుగానే <<19025631>>బదులిచ్చినా<<>> తాజాగా చర్చలకు అంగీకరించడం ఆసక్తికరంగా మారింది.

News February 5, 2026

ఫిబ్రవరి 5: చరిత్రలో ఈరోజు

image

✒1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం
✒1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం
✒1920: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జననం
✒1976: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జననం
✒1988: ప్రముఖ కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి మరణం
✒1990: క్రికెటర్ భువనేశ్వర్ కుమార్(ఫొటోలో) జననం

News February 5, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.