News September 15, 2025
15 శాతం వృద్ధిరేటు సాధనే ధ్యేయం: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. 15 శాతం వృద్ధి రేటు సాధనే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘విభజన వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయింది. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పీ-4ను తీసుకువచ్చాం. టెక్నాలజీని ఉపయోగించుకుని హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News February 2, 2026
MDK: విద్యలో ఆశల దీపం.. మిషన్ టెన్త్ క్లాస్!

మిషన్ టెన్త్ క్లాస్ కార్యక్రమం విద్యలో కొత్త ఆశలు నింపుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఓ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో చేపట్టిన చదువుకో తెలంగాణ వాల్ పోస్టర్‌ను మంత్రి సంగారెడ్డిలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి రాష్ట్రం నుంచి మండల స్థాయి వరకు ఉత్తమ ప్రతిభను గుర్తించడం గొప్ప ప్రయత్నమని మంత్రి ప్రశంసించారు. రూ.2.2 కోట్ల నగదు బహుమతులు విద్యార్థుల భవిష్యత్‌కు బలమవుతాయని తెలిపారు.
News February 2, 2026
సంగారెడ్డి: యాప్ ద్వారానే ఎరువులు కొనుగోలు: కలెక్టర్

రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా సోమవారం నుంచి ఎరువులు కొనుగోలు చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. ఎరువుల విక్రయాల్లో పారదర్శక కోసమే ప్రభుత్వం యాప్ తీసుకువచ్చిందని చెప్పారు. రైతులకు సందేహాలు ఉంటే మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు. ఎరువుల కోసం వచ్చే రైతులు ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు.
News February 2, 2026
KCRకు సిట్ నోటీసులు కక్షసాధింపే: హరీశ్ రావు

కేసీఆర్‌కి సిట్ నోటీసులు రాజకీయ కక్షసాధింపునకు పరాకాష్ట అని హరీశ్ రావు విమర్శించారు. సిట్ పేరిట జరుగుతున్నది దర్యాప్తు కాదని, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి మాత్రమేనన్నారు. చట్టపరమైన విధానాలు పాటించకుండా, సుప్రీంకోర్ట్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నాయకుడిపై రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు.


