News October 17, 2025

కాంగ్రెస్ అభ్యర్థికి AIMIM మద్దతు

image

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు AIMIM చీఫ్ అసదుద్దీన్ మద్దతు తెలిపారు. ఎన్నికల్లో నవీన్ గెలిచి జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయన్నారు. అంతకుముందు నవీన్ నామినేషన్ దాఖలు చేశారు.

Similar News

News October 17, 2025

మైనింగ్ లీజుల్లో వడ్డెర్లకు 15% రిజర్వేషన్‌పై కసరత్తు

image

AP: మైనింగ్ లీజుల్లో వడ్డెర్లకు 15% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనిపై క్యాబినెట్లో చర్చించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని మైనింగ్‌పై సమీక్షలో CM CBN అధికారులను ఆదేశించారు. సీనరేజి, ప్రీమియం మొత్తాల్లో వారికి 50% రాయితీ ఇవ్వాలని సూచించారు. తవ్వకాలపై శాటిలైట్ చిత్రాలతో అంచనా వేయాలని చెప్పారు. ఒడిశా మాదిరి వాల్యూ ఎడిషన్ చేస్తే మైనింగ్ ద్వారా ₹30వేల కోట్ల ఆదాయం వస్తుందని సూచించారు.

News October 17, 2025

14,582 పోస్టులు.. ప్రైమరీ కీ విడుదల

image

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్(CGL)-2025 టైర్-1 పరీక్ష ప్రాథమిక కీని SSC విడుదల చేసింది. అభ్యర్థులు https://ssc.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 19 వరకు కీపై అభ్యంతరాలను తెలపవచ్చు. 14,582 పోస్టులకు సెప్టెంబర్ 12 నుంచి 26 వరకు, అక్టోబర్ 14న ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 13.5 లక్షల మంది హాజరయ్యారు.

News October 17, 2025

హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లవద్దు: బీజేపీ ఎమ్మెల్యే

image

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే గోపిచంద్ పడల్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దయచేసి హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లొద్దు. అక్కడ మీ ట్రైనర్ ఎవరో తెలియదు. మంచిగా మాట్లాడే వ్యక్తిని చూసి మోసపోకండి. అర్థం చేసుకోండి. ఇంట్లోనే యోగా ప్రాక్టీస్ చేసుకోండి’ అని బీడ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.