News January 12, 2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ
ఢిల్లీలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బరిలోకి దిగుతోంది. ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలుండగా మైనారిటీ ఓట్లు కీలకంగా ఉన్న 10 నుంచి 12 చోట్ల ఆ పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో చాందినీ చౌక్, కార్వాన్ నగర్ వంటి కీలక స్థానాలున్నాయి. ఇప్పటికే రెండు స్థానాల్లో ఆ పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. వచ్చే నెల 5న ఎన్నికలు జరగనుండగా, అదే నెల 8న ఫలితాల్ని ప్రకటించనున్నారు.
Similar News
News January 12, 2025
పార్కింగ్ స్థలం ఉంటేనే కారు రిజిస్ట్రేషన్?
కారు కొనాలంటే డబ్బులుంటే చాలు అనుకుంటున్నారా? దానిని పార్క్ చేసుకునేందుకు స్థలం కూడా ఉండాలంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ట్రాఫిక్ నియంత్రణ, కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం ఫడణవీస్ కొత్త రూల్ తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం కారు రిజిస్ట్రేషన్ సమయంలో ‘పార్కింగ్ ఏరియా’ సర్టిఫికెట్ సమర్పించాలి. ముంబై, నాగ్‌పుర్, పుణేతో సహా కీలక పట్టణాల్లో ఈ రూల్ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మీ కామెంట్?
News January 12, 2025
BREAKING: వెంకటేశ్, రానాలపై కేసు నమోదు
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై సినీ నటులు వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబులపై కేసు నమోదైంది. సిటీ సివిల్ కోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉండగా డెక్కన్ కిచెన్ కూల్చివేశారని లీజుకు తీసుకున్న నందకుమార్ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. వారిపై కేసు నమోదు చేయాలని ఫిలింనగర్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 448, 452, 458, 120B సెక్షన్ల కింద పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
News January 12, 2025
దక్షిణాదిపై కేంద్రం వివక్ష: డీఎంకే మంత్రి
పన్నుల వాటాలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని తమిళనాడు డీఎంకే మంత్రి తంగం తెనరసు విమర్శించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 31.5 కోట్ల జనాభా ఉంటే రూ.27,336 కోట్లు కేటాయించిందని చెప్పారు. అదే యూపీ, బిహార్, MPల్లో 44.3 కోట్ల జనాభా ఉంటే రూ.62,024 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. దక్షిణాదికి 15%, ఆ 3 రాష్ట్రాలకు 40% ఇవ్వడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు.