News June 17, 2024
ఎయిర్ ఇండియా ఆహారంలో బ్లేడ్!

బెంగళూరు-శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బ్లేడ్ రావడం చర్చనీయాంశమైంది. ఆహారం నములుతూ ఉండగా నోటికి తగలడంతో బ్లేడ్ను గుర్తించానని, త్రుటిలో ప్రమాదం తప్పినట్లు బాధితుడు తెలిపారు. ఒకవేళ ఇదే బ్లేడ్ పిల్లల ఆహారంలో వచ్చి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన యాజమాన్యం, అది తమ క్యాటరింగ్ పార్ట్నర్ వెజిటబుల్ మెషీన్లో నుంచి వచ్చినట్లు తెలిపింది.
Similar News
News November 24, 2025
32,438 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

RRB గ్రూప్-D పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <
News November 24, 2025
ఈ డిగ్రీ ఉంటే జాబ్ గ్యారంటీ!

కంప్యూటర్ సైన్స్ డిగ్రీ హోల్డర్లకే వచ్చే ఏడాది ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు ఇండియా స్కిల్స్ రిపోర్టు-2026 వెల్లడించింది. వారిలో ఎంప్లాయిబిలిటీ రేటు 80%గా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో IT(78%), B.E/B.Tech(70%), MBA(72.76%), కామర్స్(62.81%), నాన్ IT సైన్స్(61%), ఆర్ట్స్(55.55%), ITI-ఒకేషనల్(45.95%), పాలిటెక్నిక్(32.92%) ఉన్నట్లు అంచనా వేసింది. డిగ్రీతోపాటు స్కిల్స్ ముఖ్యమని పేర్కొంది.
News November 24, 2025
కాపర్ టి-రకాలు

అవాంఛిత గర్భధారణను నివారించడానికి డాక్టర్లు కాపర్ టిని సూచిస్తారు. దీంట్లో రెండు రకాలున్నాయి. ఒకటి హార్మోనల్, మరొకటి నాన్ హార్మోనల్. హార్మోన్ కాపర్-టిలో లెవోనార్జెస్ట్రెల్ అనే హార్మోన్ విడుదలై శుక్రకణాలు అండం వద్దకు చేరకుండా ఆపుతుంది. నాన్ హార్మోనల్ కాపర్ టి రాగి అయాన్లను విడుదల చేస్తుంది. ఇవి శుక్రకణాలను, అండాలను నాశనం చేస్తాయి. వైద్యుల సలహాతో మీకు ఏది సరిపోతుందో తెలుసుకొని వాడటం మంచిది.


