News July 4, 2024

భారత క్రికెటర్ల కోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్ రద్దు

image

బార్బడోస్‌లో ఉన్న భారత క్రికెటర్లు ఎయిర్ ఇండియా విమానంలో భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫ్లైట్ నెవార్క్ నుంచి ఢిల్లీ రావాల్సినదని, చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసి ఆటగాళ్ల కోసం బార్బడోస్‌కు మళ్లించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేయలేదని సోషల్ మీడియాలో వాపోయారు. దీంతో సీరియస్ అయిన DGCA తమకు సమగ్ర నివేదికను అందించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది.

Similar News

News February 13, 2026

శివ నామాలు అర్థాలు ‘‘నీల లోహిత’’

image

సృష్టి ఆరంభంలో బ్రహ్మ దేవుడి కోపం నుంచి శివుడు ఉద్భవించినప్పుడు ఆయన ‘నీల లోహిత’ రూపంలో ఉన్నాడు. ‘నీల’ అంటే ఆకాశం అంతటి నీలి రంగు, ‘లోహిత’ అంటే అగ్ని లాంటి ఎరుపు రంగు. అంటే సృష్టిలోని శాంతిని, అలాగే ప్రళయ కాలంలోని తీవ్రతను రెండింటినీ ఆయన తనలో కలిగి ఉంటారని దీని అర్థం. అర్ధనారీశ్వర రూపానికి ఇది మరో సంకేతం. నీలం రంగు జ్ఞానానికి చిహ్నం అయితే, ఎరుపు రంగు శక్తికి, క్రియాశీలతకు నిదర్శనం.

News February 13, 2026

పత్తి పంట తీసిన తర్వాత ఏం చేయాలి?

image

పత్తి తీత పూర్తయ్యాక తప్పనిసరిగా పంట విరామం పాటించాలి. ఈ సమయంలో పక్షులు వాలేలా Y ఆకారపు చెట్ల కొమ్మలను భూమిలో పాతి ఉంచడం వల్ల అవి పంటలకు సహజ శత్రువులైన పురుగులను తినే అవకాశం ఉంటుంది. పంట కోత తర్వాత పొలంలో తడి లేకుండా చూడాలి. లేకుంటే కింద పడిన కాయల్లో పురుగుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంటుంది. పత్తితీత తర్వాత పొలాల చుట్టూ ఉన్న రోడ్లు, కాలువ గట్లు, పొలాల అంచుల్లో పత్తి మొక్కలను పూర్తిగా తొలగించాలి.

News February 13, 2026

JIPMERలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

image

<>జవహర్‌లాల్<<>> ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్(JIPMER) 26 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. MBBS అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28న రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,10,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://jipmer.edu.in