News August 11, 2025

ఎయిర్ ఇండియా ‘ఫ్రీడమ్ సేల్’

image

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఎయిర్ ఇండియా ‘ఫ్రీడమ్ సేల్’ ఆఫర్ తీసుకొచ్చింది. దేశీయ ప్రయాణాలకు సంబంధించి టికెట్ ధరలు రూ.1,279, విదేశాలకు సంబంధించి రూ.4,279 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. చెక్ ఇన్ బ్యాగేజీకి రూ.200 అదనంగా చెల్లించాలని వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 15వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయంది. ఈ నెల 19 నుంచి 2026 మార్చి 31 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.

Similar News

News August 11, 2025

మాజీ ఉపరాష్ట్రపతి ఎక్కడంటూ అమిత్ షాకు లేఖ

image

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడ ఉన్నారో క్లారిటీ ఇవ్వాలని శివసేన MP సంజయ్ రౌత్ హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. ‘JUL 21న రాజీనామా చేసినప్పటి నుంచి ధన్‌ఖడ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆయన ఆరోగ్యం తదితర పూర్తి వివరాలను నిజాయితీగా వెల్లడించాలి. కొందరు ఎంపీలు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. కానీ ముందు మిమ్మల్ని అడగాలని నేను డిసైడ్ అయ్యా’ అని రాసుకొచ్చారు.

News August 11, 2025

హార్దిక్‌కు షాక్.. గిల్‌కు ప్రమోషన్!

image

ఆసియా కప్‌లో గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాండ్య స్థానంలో ఈ యంగ్ ప్లేయర్‌ను VCగా నియమిస్తారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆయనకు వైస్ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పాయి. ENGతో టెస్టు సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకుంటున్న T20 కెప్టెన్ సూర్య టోర్నీ ప్రారంభంలోపు ఫిట్ అవుతారని తెలిపాయి.

News August 11, 2025

కాంగ్రెస్ చేతకానితనంతో ఎకానమీ పతనమవుతోంది: KTR

image

TG: కాంగ్రెస్ పాలనపై BRS నేత KTR ఫైరయ్యారు. CAG తాజా నివేదిక ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్నారు. ‘6 గ్యారంటీలకు బదులు ఫెయిల్డ్ ఎకానమీని ఇచ్చారు. కాంగ్రెస్ చేతకానితనంతో రాష్ట్ర ఎకానమీ పతనమవుతోంది. తొలి క్వార్టర్‌లోనే రూ.10,583 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఒక్క రోడ్డు వేయకుండా, ప్రాజెక్టు స్టార్ట్ చేయకుండా, స్టూడెంట్స్‌కు సరైన తిండి పెట్టకుండానే రూ.20,266 కోట్ల అప్పు చేశారు’ అని Xలో దుయ్యబట్టారు.