News May 9, 2024
వంట వాసనతోనూ వాయు కాలుష్యం!
ఎక్కడైనా వంట చేస్తుంటే వాసన పీల్చి ఆహా అనుకుంటాం. ఇకపై అలాంటి స్మెల్‌కు జాగ్రత్త పడాల్సిందే. ఆహారం వండినప్పుడు వచ్చే వాసన గాలి కాలుష్యానికి కారణమవుతోందని NOAA వెల్లడించింది. USలోని 3 ప్రధాన నగరాల్లో వంట సమయంలో అస్థిర కర్బన సమ్మేళనాల(VOC)ను గుర్తించినట్లు తెలిపింది. వెహికల్స్, అడవుల్లో కార్చిచ్చు, వ్యవసాయ ఉత్పత్తులతో సహా వచ్చే మొత్తం VOCల్లో 21% వంటకు సంబంధించింనవేనని పేర్కొంది.
Similar News
News December 25, 2024
కుటుంబ సభ్యులతో YS జగన్(PHOTO)
AP: YS జగన్ కడప జిల్లా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇడుపులపాయలోని YSR ఎస్టేట్‌లో తన బంధువులు, కుటుంబ సభ్యులతో జగన్ సరదాగా ఓ ఫొటో దిగారు. ఇందులో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు సోదరులు YS అనిల్, సునీల్, అవినాశ్ రెడ్డి, కుమార్తెలు వర్ష, హర్ష సహా తదితరులు ఉన్నారు. దీంతో ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి.
News December 24, 2024
మణిపుర్‌కు కొత్త గవర్నర్.. కేంద్రం వ్యూహం ఇదేనా?
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా అజయ్ కుమార్ భల్లాను నియమించింది. గతంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన్ను అనూహ్యంగా తెరమీదకు తేవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాంతి భద్రతల అంశాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉన్న కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
News December 24, 2024
జనవరి 1న శ్రీశైలం వెళ్తున్నారా?
AP: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో జనవరి 1న స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. న్యూఇయర్ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఉదయాస్తమాన, ప్రాతఃకాల, ప్రదోషకాల సేవలనూ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులందరికీ స్వామి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని వెల్లడించారు.