News April 20, 2024

2026 నాటికి ఎయిర్ ట్యాక్సీలు?

image

2026 నాటికి దేశంలో ఎయిర్ ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో మాతృసంస్థ గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్చర్ ఏవియేషన్ ఈ సేవలు అందించనున్నాయి. తొలుత ఢిల్లీ.. ఆ తర్వాత ముంబై, బెంగళూరులో ఇవి ఎగరనున్నాయి. ట్యాక్సీల్లో పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. దీని ధర 1 బిలియన్ డాలర్లు ఉంటుంది. 27 కి.మీ దూరాన్ని 7 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇందుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఛార్జి ఉండనుంది.

Similar News

News March 17, 2026

అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు!

image

TG: గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలు అందించే బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి ఆమోదం లభించేలా చేసి, మేడే లోపు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 3-4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. HYDలో వెల్ఫేర్ బోర్డు, వారిని వ్యవస్థీకృత పరిధిలోకి తెచ్చేందుకు ప్రత్యేక సైట్, యాప్‌ను సర్కార్ సిద్ధం చేస్తోంది.

News March 17, 2026

విజయ్-రష్మిక హల్దీ వేడుకల ఫొటోలు.. వైరల్

image

గత నెలలో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక తమ హల్దీ వేడుక ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ రోజు హల్దీ+హోలీ మాదిరిగా రంగుల్లో తడిసిపోయామని రష్మిక పేర్కొన్నారు. ఇప్పటికీ తన జుట్టు ఎరుపు రంగులోనే ఉందన్నారు. అద్భుతమైన వేడుకలకు సహకరించిన సిబ్బందికి థాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.