News December 6, 2024
ఎయిర్‌లైన్స్ నెల ముందే టిక్కెట్ ధరలు చెప్పాలి: కేంద్రం

విమానయాన సంస్థలు టికెట్ ధరలను మార్చడానికి నెలరోజుల ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ధరల నియంత్రణకు కొత్త చర్యలు తీసుకుంటున్నాం. ఎయిర్‌లైన్స్ తమ టికెట్ ధరలు 24 గంటల్లోనే మార్చుకునేందుకు వీలు కల్పించే 2010 నిబంధనను తొలగిస్తున్నాం. ఎయిర్‌లైన్స్ ఇష్టారాజ్యంగా ధరలు మార్చడానికి వీల్లేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
బీజేపీ ‘మిషన్ బెంగాల్’.. టార్గెట్ 160

బిహార్‌లో భారీ విజయం సాధించిన BJP ఫోకస్‌ను బెంగాల్ వైపు మళ్లించింది. 2026 ఎన్నికల్లో 160+ సీట్లే లక్ష్యంగా వ్యూహం రచిస్తోంది. TMCకి క్షేత్రస్థాయి కార్యకర్తల సపోర్ట్‌ను బ్రేక్ చేయాలని, మమత అల్లుడు అభిషేక్ బెనర్జీని వ్యతిరేకించే వారిని తమవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తోంది. వారసత్వ రాజకీయం, అక్రమ ఓట్లపై టార్గెట్ చేయాలని చూస్తోంది. హిందూ ఓట్లు పోలరైజ్ చేయాలని నిర్ణయించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.
News November 24, 2025
స్మృతి పెళ్లి వాయిదా.. పలాశ్ సోదరి రిక్వెస్ట్!

టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడేందుకు వాళ్ల ఫాదర్ ఆరోగ్య పరిస్థితి కారణమని పలాశ్ ముచ్చల్ సోదరి పాలక్ ముచ్చల్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో తమ కుటుంబాల గోప్యతకు గౌరవం ఇవ్వాలని ఆమె కోరారు. నిన్న ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో పెళ్లి వాయిదా పడినట్లు మేనేజర్ తుహిన్ మిశ్రా ప్రకటించిన సంగతి తెలిసిందే.
News November 24, 2025
వన్డేలకు రెడీ అవుతున్న హిట్‌మ్యాన్

ఈ నెల 30 నుంచి సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం రోహిత్ శర్మ సిద్ధం అవుతున్నారు. గత 5, 6 రోజులుగా అతడు బెంగళూరు ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారు. ఫిట్నెస్ పెంచుకోవడంతో పాటు ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లతో స్పెషల్ సెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తాను జిమ్‌లో గడిపే ఫొటోలను రోహిత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.


