News November 27, 2024

వరంగల్‌తో పాటు ఆ ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు: రామ్మోహన్ నాయుడు

image

TG: రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల ఏర్పాటు విషయమై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో భూసేకరణ పూర్తవ్వగానే వీలైనంత త్వరగా పనులు చేపడుతామని చెప్పారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం డెవలప్‌మెంట్‌కు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

వరంగల్: ఓట్లకు మహిళలపై ఫోకస్..!

image

అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీల్లో ఓట్లు రాబట్టేందుకు మహిళలపై ఫోకస్ చేసింది. ఉమ్మడి జిల్లాలో చాలా వేగంగా మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. వరంగల్‌లో 11,295, HNK 10,625, మహబూబాబాద్ 15,511, భూపాలపల్లి 8,257, ములుగు 6,930 గ్రూపుల్లో 6,76,000 మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నారు. వీరితో పాటుగా రేషన్ కార్డున్న వారికి సైతం అందించి ఓట్లను సంపాదించాలనే ఆలోచనలో హస్తం నేతలున్నారు.

News November 24, 2025

ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

image

TG: హైదరాబాద్ శామీర్‌పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.

News November 24, 2025

భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

image

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.