News July 19, 2024
విమానాశ్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి: కేంద్ర మంత్రి రామ్మోహన్

దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. దేశంలోని విమాన సర్వీసులన్నీ టెక్నికల్ నుంచి మాన్యువల్‌గా మారుస్తున్నామని తెలిపారు. కాగా విండోస్ సమస్యతో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లోని ఆన్లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో వందలాది విమానాలు రద్దయ్యాయి.
Similar News
News November 17, 2025
సినిమా అప్డేట్స్

* సన్నీ డియోల్ ‘జాట్-2’ చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి డైరెక్షన్ చేయనున్నట్లు సమాచారం. తొలి పార్ట్‌ను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్టులో బిజీగా ఉండటమే కారణం.
* సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో ‘హీరామండి’ సీక్వెల్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
* యూనిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా ఎంపికవడం గర్వంగా ఉంది. పిల్లలు సంతోషం, ఆరోగ్యంతో కూడిన జీవితాన్ని గడపడానికి కృషి చేస్తా: కీర్తి సురేశ్
News November 17, 2025
ఆధార్ లేకున్నా స్కూళ్లలో ప్రవేశాలు!

TG: ఆధార్, బర్త్ సర్టిఫికెట్ లేకున్నా పిల్లలు బడిలో చేరొచ్చని విద్యాశాఖ తెలిపింది. గుర్తింపు పత్రాలు లేవని స్కూళ్లలో ప్రవేశాలను నిరాకరించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్, ఇతర సర్టిఫికెట్లు లేవని వలస కార్మికుల పిల్లలను స్కూళ్లలో చేర్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పత్రాలేవీ లేకున్నా ప్రవేశాలు కల్పించాలని అన్ని స్కూళ్లకు ఆదేశాలిచ్చింది. TC జారీ విషయంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
News November 17, 2025
ఒంటరిని చేసి వేధిస్తారు

మానసికంగా వేధించే వారి శైలి భిన్నంగా ఉంటుంది. కొందరు భాగస్వామిని వారి స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి క్రమంగా దూరం చేస్తుంటారు. కొంతకాలానికి వారికి తాను తప్ప ఇంకెవరూ లేరన్నంతగా తమపై ఆధారపడేలా చేసుకుంటారు. ఇలా పూర్తిగా తమ వశమయ్యాక మాటలతో వేధిస్తూ రాక్షసానందం పొందుతుంటారు. ప్రతిదానికీ తమ అనుమతి తీసుకోవాలంటారు. ఇలాంటి వారి చేతుల్లో చిక్కుకున్న వారి జీవితం నిత్య నరకంలా మారుతుంది.


