News July 31, 2024
వయనాడ్ వరద బాధితులకు Airtel సాయం!

కేరళలోని వయనాడ్ వరద బాధితులకు Airtel తన వంతు సాయాన్ని ప్రకటించింది. రీఛార్జ్ వాలిడిటీ ఎక్స్‌పైర్ అయిన ప్రీపెయిడ్ కస్టమర్లకు 3 రోజులపాటు 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందించనుంది. పోస్ట్ పెయిడ్ యూజర్లకు బిల్ పేమెంట్ గడువును 30రోజులు పొడిగించింది. అప్పటివరకూ బిల్ చెల్లించకపోయినా సేవల్లో అంతరాయం ఉండదని తెలిపింది. తమ రిటైల్ స్టోర్లను రిలీఫ్ మెటీరియల్ కలెక్షన్ పాయింట్లుగా మార్చనున్నట్లు పేర్కొంది.
Similar News
News November 27, 2025
జీవో 46పై విచారణ రేపటికి వాయిదా

TG: ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఈ జీవో జారీ చేయడంతో వెనుకబడిన కులసంఘాలు పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్ అత్యవసర పిటిషన్‌గా విచారణ చేపట్టాలని కోరారు. బీసీలలో A, B, C, D వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.
News November 27, 2025
లడ్డూ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం: YV సుబ్బారెడ్డి

AP: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తాను 30 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నానని, దేవుడి ప్రతిష్ఠ పెంచేలా పని చేశానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి ఘటనలో నిజాలు తెలియజేయడానికి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.
News November 27, 2025
కీరదోసలో ఆకుమచ్చ, వెర్రి తెగులు నివారణ

కీరదోసలో ఆకులమచ్చ తెగులు వల్ల ఆకులపై చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడి, తర్వాత ఇవి పెద్దగా మారి ఆకు ఎండి రాలిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు వల్ల ఆకులలో ఈనెలు ఉండే ప్రాంతంలో చారలు ఏర్పడి, మొక్క గిడస బారి, పూత తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ 2mlను కలిపి పిచికారీ చేయాలి.


