News August 24, 2025
airtel ఇంటర్నెట్ డౌన్.. యూజర్ల ఇబ్బందులు

airtel మొబైల్, బ్రాడ్‌బాండ్ సేవలు ఉదయం 11 గంటల నుంచి నిలిచిపోయాయని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కాల్స్ చేసుకోవడానికి నెట్‌వర్క్ పని చేస్తున్నా నెట్ వాడేందుకు వీలు కావట్లేదంటున్నారు. చాట్ చేసేందుకూ ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. కొందరు మొబైల్ రీస్టార్ట్ చేసి ప్రయత్నిస్తున్నారు. దీనిపై airtel స్పందించాల్సి ఉంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? కామెంట్ చేయండి.
Similar News
News August 24, 2025
అప్పుడు ఊరికి ఓ గణపతి.. నేడు వీధికొకటి!

ఇరవై ఏళ్ల కిందట వినాయక చవితికి ముందు 3రోజులు, ఆ తర్వాత నిమజ్జనం దాకా గ్రామాల్లో సందడి మామూలుగా ఉండేది కాదు. చందాలు సేకరించి ఊరంతటికీ కలిపి ఓ విగ్రహాన్ని సెలక్ట్ చేయడం, మండపాల నిర్మాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు అని ప్లాన్ చేసేవాళ్లు. కానీ ఆ తర్వాత వీధికొక విగ్రహం ఏర్పాటు చేస్తుండటం వల్ల ఊరంతా కలిసి సంబరాలు చేసుకొనే కల్చర్ మాయమవుతోందని ముఖ్యంగా 90’s కిడ్స్ ఫీలవుతున్నారు. మీ COMMENT.
News August 24, 2025
రష్యా న్యూక్లియర్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ అటాక్

ఓ వైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ తమ ఇండిపెండెన్స్ డే వేళ రష్యాలోని భారీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై అటాక్ చేసింది. దీంతో ఫ్యూయెల్ టెర్మినల్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. కనీసం 95 ఉక్రెయినియన్ డ్రోన్స్‌ను కూల్చేశామని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. రేడియేషన్ లెవెల్ నార్మల్‌గానే ఉందని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది.
News August 24, 2025
గుడ్‌న్యూస్.. మండపాలకు ఉచిత విద్యుత్

TG: వినాయక చవితి, దుర్గాదేవి నవరాత్రుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మండపాలకు అనుమతి ఉన్నవారు ఎక్కడి నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకుంటారనే వివరాలు సమర్పించాలని సూచించింది. కాగా ఉచిత విద్యుత్‌కు సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం నుంచి తీసుకుంటామని అధికారులు తెలిపారు.