News August 18, 2025

Airtel నెట్‌వర్క్ డౌన్.. యూజర్స్ ఫైర్

image

దేశంలోని పలు ప్రాంతాల్లో Airtel నెట్‌వర్క్ డౌన్ అయింది. దీనిపై యూజర్స్ SMలో ఫైర్ అవుతున్నారు. కాల్స్, ఇంటర్నెట్ సమస్యలతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు రిపోర్ట్ చేస్తున్నారు. దీనిపై ఎయిర్టెల్ స్పందించింది. ‘మా టీం ఈ సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తోంది. త్వరలో సేవలను పునరుద్ధరిస్తాం. అసౌకర్యానికి క్షమించండి’ అని స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా?

Similar News

News August 18, 2025

హార్ట్‌ఎటాక్‌ను 12ఏళ్ల ముందే గుర్తించొచ్చు!

image

గుండెపోటు సంభవించడానికి పుష్కరం ముందే కొన్ని సంకేతాలు వస్తాయని అమెరికా హార్ట్ అసోసియేషన్ పేర్కొంది. ఏటా ఓపిక తగ్గుతూ ఉంటే మీ గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని అర్థం. ‘5KMPH వేగంతో నడవటానికీ ఇబ్బందిపడటం. చిన్న పనులు, వ్యాయామం చేసినా త్వరగా అలసిపోవడం, ఊపిరి ఆడకపోవడం’ వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి. వేగంగా నడవడం, పరిగెత్తడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

News August 18, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపు వాయుగుండంగా మారుతుందని APSDMA హెచ్చరించింది. దీని ప్రభావంతో APలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఇవాళ పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇవ్వగా, రేపు కూడా ఇవ్వాలా? లేదా? అనేది పరిస్థితిని బట్టి చెబుతామని మంత్రి <<17441655>>సంధ్యారాణి<<>> తెలిపారు. కానీ ఇప్పటివరకు అలాంటి ప్రకటనేది రాకపోవడంతో రేపు స్కూళ్లు యథావిధిగా నడిచే అవకాశముంది.

News August 18, 2025

తప్పుడు ప్రచారాలతో వైసీపీ గందరగోళం సృష్టిస్తోంది: CM చంద్రబాబు

image

AP: నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే YCP పని అని CM చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘రాజధాని మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని సొంత టీవీ, పత్రికల్లో అసత్య ప్రచారం చేయిస్తోంది. ఊళ్లు మునిగిపోతున్నాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. తప్పుడు వార్తలతో గందరగోళం సృష్టించాలని చూస్తోంది. ఈ ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలి’ అని మంత్రులు, పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.