News August 5, 2024
Airtel అదుర్స్: నికర లాభం డబుల్

భారతీ ఎయిర్టెల్ అదరగొట్టింది. అంచనాలను మించి ఫలితాలను విడుదల చేసింది. Q1 FY25లో నికర లాభం 128% వృద్ధిచెంది రూ.2068 కోట్ల నుంచి రూ.4717 కోట్లకు పెరిగింది.
* ఆదాయం రూ.37,599 కోట్ల నుంచి రూ.38,506 కోట్లకు పెరిగింది.
* ఎబిటా 1.8% వృద్ధితో రూ.19,365 కోట్ల నుంచి రూ.19,708 కోట్లకు పెరిగింది.
* ఎబిటా మార్జిన్ 51.5 నుంచి 52.2 శాతానికి తగ్గింది.
* మొబైల్ సర్వీసెస్ ARPU రూ.209 నుంచి రూ.211కు పెరిగింది.
Similar News
News January 19, 2026
మళ్లీ ఇండియాకు రాను: విదేశీయురాలు

ఇండియా పర్యటనకు వచ్చిన అమెరికన్ మహిళకు ఢిల్లీ మెట్రోలో చేదు అనుభవం ఎదురైంది. సెల్ఫీ సాకుతో వచ్చిన ఓ టీనేజ్ బాలుడు ఆమె బ్రెస్ట్‌ను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణాన్ని అబ్బాయి తల్లి వెనకేసుకొస్తూ అది ‘ఓవర్ యాక్షన్’ అని కొట్టిపారేయడం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ‘ఇకపై భారత్‌కు, దక్షిణాసియాకే రాను’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
News January 19, 2026
స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టండిలా!

డెలివరీ అయిన తర్వాత చాలామంది మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. వీటిని ఎలా తొలగించుకోవాలంటే.. * ఆముదం నూనెను స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి, 15నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత హీటింగ్ ప్యాడ్‌ను ఆ మార్క్స్‌పై 10 నిమిషాలు ఉంచాలి. ఇలా నెలరోజులు చెయ్యాలి. * కలబంద గుజ్జును స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి, మూడు గంటల పాటు వదిలేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేయాలి.
News January 19, 2026
అమరావతికి స్వయం ప్రతిపత్తి దిశగా అడుగులు

AP: అమరావతికి స్వయంప్రతిపత్తి కల్పించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. తొలిసారిగా ప్రపంచబ్యాంకు, ADB రూల్స్‌కు అనుగుణమైన రీతిలో పాలనా వ్యవహారాలు సాగేలా ఇవి ఉండనున్నాయి. ఆర్థిక అవసరాలు తీరేలా భూములు అమ్ముకొనే వీలు కల్పించనున్నారు. వనరులను మదింపుచేసి స్థిరమైన రాబడి కోసం పెట్టుబడులు వచ్చేలా ఫ్రేమ్వర్కును ఏర్పరుస్తారు. పాలన కోసం అత్యున్నత మండలిని ఏర్పాటుచేస్తారు. ప్రస్తుత MNP చట్టాలనూ మారుస్తారు.


