News June 28, 2024

Airtel రీఛార్జ్ ధరలు పెంపు

image

నిన్న జియో రీఛార్జ్ రేట్లు పెరగ్గా.. తాజాగా Airtel టారిఫ్స్ పెరిగాయి. జులై 3 నుంచి పెంచిన ధరలు దేశంలోని అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. రూ.179ను రూ.199కి, రూ.299ను రూ.349కి, రూ.399ని రూ.449కి రూ.455ను రూ.509కి పెంచింది. మొత్తంగా Airtel రీఛార్జ్ ధరలు 10-21% పెరిగాయి.

Similar News

News November 22, 2025

శ్రీకాకుళం: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

image

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

News November 22, 2025

ఏడు శనివారాల వ్రతానికి దివ్య ముహూర్తం నేడే..

image

శని దోష నివారణ కోసం చేసే 7 శనివారాల వ్రతాన్ని నేడు ప్రారంభించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ‘వ్రతాన్ని ఈరోజు మొదలుపెడితే వచ్చే ఏడాది JAN3 పౌర్ణమి రోజున పూర్తవుతుంది. పౌర్ణమి సంయోగం వల్ల అధిక ఫలితం ఉంటుంది. ఏడో వారానికి ముందు వైకుంఠ ఏకాదశి రావడం, వ్రత కాలంలో ధనుర్మాసం ఉండటం వల్ల శనిదేవుడు, విష్ణువు అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు’ అంటున్నారు. వ్రతం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 22, 2025

సమీకృత దాణాతో పశువులకు కలిగే మేలు

image

పశువుల పోషణలో భాగంగా పాడిపశువులకు సమతుల ఆహారం అందించడం ముఖ్యం. రోజూ అందించే దాణాతో పాటు సమీకృత దాణా కూడా అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాల దిగుబడి కూడా పెరుగుతుంది. మనకు అందుబాటులో ఉన్న దినుసులను తగిన మోతాదులో కలిపి సమీకృత దాణాను తయారు చేయవచ్చు. ఇలా స్వయంగా తయారు చేసుకున్న దాణాలో మెులాసిస్ అరోమా పొడిని 250-500 గ్రాములు కలిపితే దాణా సువాసన కలిగి, రుచిగా ఉంటుంది.