News October 23, 2024
AISF: హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి

పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అలాగే విద్య శాఖ మంత్రి కేటాయించాలని AISF ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేసి బండ్లగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Similar News
News November 11, 2025
HYD: అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య

రాజేంద్రనగర్ హనుమాన్‌నగర్ ప్రాంతానికి ధనుష్ కుమార్(22) హౌస్ కీపింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం ఆస్పత్రికి వెళ్లి వస్తానని తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని బయటికి వెళ్లాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రితోపాటు చుట్టు పక్కల వెతికారు. సోమవారం వాలంతరి ఏపీఈఆర్‌ఎల్ వెనుక చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 11, 2025
HYD: బైక్‌లపై వచ్చి ఇంటింటా ‘ఓటు కవర్’ డెలివరీ!

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేపు(మంగళవారం) బైపోల్ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారుల నిఘా ఉన్నప్పటికీ, బైక్‌లపై కొందరు పేపర్ బాయ్ తరహాలో బస్తీల్లోని ప్రతి ఇంటి వద్దకు వచ్చి, డబ్బు, గుర్తుతో ఉన్న ఎన్వలప్ కవర్లను విసిరేసి పోతున్నారు. ఓటు కోసం విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది.
News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. నచ్చకపోతే కనీసం నోటాకైనా వేయండి!

ప్రజాస్వామ్యంలో ప్రజల చేత.. ప్రజల కోసం ఎన్నుకునే ప్రభుత్వమని చదువుకున్నాం.. ఇపుడు జూబ్లీహిల్స్‌లో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం లేదు కానీ.. నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక్కరు.. ఇద్దరు కాదు 58 మంది నాయకులు.. ‘‘మేము మీ సమస్యలు పరిష్కరిస్తాం’’ అంటూ నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే బరిలో నిలిచారు. వారిలో మీకు నచ్చిన వారిని ఎన్నుకోండి.. లేకపోతే కనీసం నోటాకు అన్న ఓటేయండి. ఇది మీ బాధ్యత.


