News October 23, 2024
AISF: హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అలాగే విద్య శాఖ మంత్రి కేటాయించాలని AISF ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేసి బండ్లగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Similar News
News February 24, 2026
నాగోల్: బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఘరానా మోసం: బాధితుడు

నాగోల్ PS పరిధి అల్కాపురి బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో ఘరానా మోసం జరిగిందని వికలాంగుడైన బాధితుడు ఆరోపించారు. కొత్త మొబైల్ పేరిట పాత ఫోన్ అంటగట్టినట్లు ఆయన వాపోయారు. తనకు న్యాయం చేయాలని షోరూమ్ ముందు నిరసనకు దిగగా.. సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. వినియోగదారుల హక్కులను కాలరాసే ఇలాంటి వ్యవహారాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని షోరూమ్ ముందు బైఠాయించారు.
News February 24, 2026
HYD: షాకింగ్! 13ఏళ్ల బాలికకు గుండెపోటు

వయసుతో సంబంధంలేకుండా నమోదవుతున్న గుండెపోటు మరణాలు వేధిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి మంచాలలోనూ సోమవారం ఓ పసి గుండె ఆగింది. స్థానికుల వివరాలిలా.. ఆగపల్లి గ్రామస్థుడు లకుమళ్ల యాదవరావు కూతురు నిహారిక(13) ఛాతిలో నెప్పితో తల్లడిల్లుతుంటే నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. చిన్న వయసులో హాట్‌ఎటాక్‌తో మరణించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
News February 24, 2026
HYDలో ఇసుక బజార్ల ఏర్పాటుకు చర్యలు

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇసుక బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి ప్రభుత్వం కొత్తగా ఇసుక బజార్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 4 ఇసుక బజార్లు ప్రారంభించబడ్డాయి. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో మే నాటికి 6 కొత్త ఇసుక బజార్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇసుకను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి సహాయపడతాయి.


