News October 12, 2024
బాలకృష్ణ సరసన ఐశ్వర్యరాయ్?

నందమూరి బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య సరసన ఐశ్వర్యరాయ్ నటిస్తున్నట్లు టాక్. కాగా నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో బాలయ్య కూడా నటిస్తున్నారని, ఇందులోనే ఆయన సూపర్ హీరోగా కనిపిస్తారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News December 7, 2025
NKD: సర్పంచ్ రేసులో నానమ్మ, మనువడు

ఖేడ్ మండలంలో సర్పంచ్ రేసులో నానమ్మ, మనువడు నిలిచారు. పీర్ల తాండకు చెందిన సాలిబాయి, ఆమె మనువడు సచిన్ నామినేషన్ వేశారు. ఇరువురి నామినేషన్లు సక్రమంగానే ఉండగా ఈనెల 9న సచిన్ నామినేషన్ విత్ డ్రా చేసుకోనున్నారు. దీంతో సాలిబాయి ఏకగ్రీవం కానున్నారు. 8 వార్డుల్లోనూ ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో జీపీ పాలకవర్గం ఏకగ్రీవం అయినట్టే. ఈమె భర్త జీవులనాయక్ 1987లో ఖేడ్ ప్రథమ MPP అయ్యారు. ఈయన సర్పంచ్గానూ పనిచేశారు.
News December 7, 2025
ఆ లంబాడీలు ఎస్టీలు కాదు: హైకోర్టు

TG: 1956 తర్వాత మహారాష్ట్ర నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ లంబాడీలు ఎస్టీ క్యాటగిరీ కిందకు రాబోరని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ఎస్టీ సర్టిఫికెట్ను రద్దు చేశారని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హాన్ దేవానంద్ కుటుంబం హైకోర్టుకు వెళ్లింది. 1950 నాటికి తెలంగాణలో నివసించే లంబాడీలు, వారి పూర్వీకులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడీలకు మాత్రమే ఎస్టీ క్యాటగిరీ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
News December 7, 2025
20 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు ఈ టెస్టులు చేయించుకోవాలి

20 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే మహిళలు 20 ఏళ్ల తర్వాత కొన్ని పరీక్షలు తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. HPV టెస్ట్, STD టెస్ట్, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. అలాగే ఎప్పటికప్పుడు నెలసరిని వస్తుందా.. లేదా.. ఏవైనా హార్మోన్ సమస్యలున్నాయా అన్నవీ చెక్ చేసుకోవాలి. వీటితో పాటు హెల్తీ పుడ్, వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.


