News November 28, 2024

‘బచ్చన్’ లేకుండానే ఐశ్వర్యరాయ్ పేరు

image

దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఐశ్వర్యరాయ్ పేరు వెనుక బచ్చన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అభిషేక్ బచ్చన్‌ నుంచి ఆమె విడిపోయారన్న వార్తలకు ఇది మరింత ఊతమిచ్చింది. దుబాయ్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ మహిళా సదస్సుకు ఐష్ హాజరయ్యారు. ఆమె పేరును అక్కడి స్క్రీన్‌పై ‘ఐశ్వర్యరాయ్-ఇంటర్నేషనల్ స్టార్’ అని ప్రదర్శించారు. ఐష్‌కి తెలియకుండా ఇది జరగదని, ఆమె భర్త నుంచి విడిపోయారని అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది.

Similar News

News November 22, 2025

సిరిసిల్ల జిల్లాలో మహిళా ఓటర్లు.. ఎందరంటే..?

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 11,787 అధికంగా ఉన్నాయి. మొత్తం 260 గ్రామపంచాయతీలు, 2,268 వార్డుల పరిధిలో 3,53,351 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,70,772 మంది పురుషులు, 1,82,559 మంది మహిళలు ఉన్నారు. ఎల్లారెడ్డిపేటలో అత్యధికంగా 40,886 మంది ఓటర్లు ఉండగా, వీర్నపల్లి మండలంలో అత్యల్పంగా 11,727 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఆదివారం పూర్తికానుంది.

News November 22, 2025

పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

image

దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యా నుంచి భారత్‌కు తక్కువ రేటుకు వస్తున్న ముడి చమురు దిగుమతులు తగ్గడమే ఇందుకు కారణమని సమాచారం. రష్యా ఆయిల్ సంస్థలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలతో కొన్ని భారత కంపెనీలు ఇప్పటికే కొనుగోళ్లు ఆపేశాయి. US, పశ్చిమాసియా నుంచి వచ్చే ఆయిల్‌తో దిగుమతి ఖర్చు పెరగనుంది. దీంతో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చని తెలుస్తోంది.

News November 22, 2025

విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం: మావోయిస్ట్ పార్టీ

image

డిసెంబర్ 2 నుంచి 8 వరకు ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (PLGA) 25వ వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని CPI(మావోయిస్టు) సెంట్రల్ మిలిటరీ కమిషన్ పిలుపునిచ్చింది. కగార్ యుద్ధం నుంచి పార్టీని, PLGAని, ప్రజా సంఘాలను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేద్దామని పేర్కొంది. 11 నెలల్లో 320 మంది కామ్రేడ్స్ అమరులయ్యారని తెలిపింది.