News March 24, 2024
మూడోసారి ప్రధాని ప్రత్యర్థిగా అజయ్‌రాయ్

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు. ఈయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వారణాసి నుంచి 2009లో SP, 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మోదీని మూడోసారి ఢీకొట్టబోతున్నారు. ఎస్పీ, ఆప్‌తో పొత్తు ఉండటం కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 19, 2026
ECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్‌లోని <
News January 19, 2026
వరిలో అగ్గి తెగులు – నివారణకు సూచనలు

వరి దుబ్బు చేసే దశలో అగ్గి తెగులు కనిపిస్తుంది. దీని వల్ల వరి పైర్లలో ఆకులపై నూలు కండె ఆకారం మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద, వెన్నుల మీద గోధుమ రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్క వెన్నువిరిగి వేలాడుతుంది. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 75% 0.6gm లేదా అజాక్సీస్ట్రోబిన్+టెబుకోనజోల్ 2 ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News January 19, 2026
తిరుమల: లక్కీడిప్‌లో సులభంగా సెలెక్ట్ అవ్వాలంటే?

ఆన్లైన్ లక్కీడిప్‌లో పోటీ చాలా ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు దరఖాస్తు చేసుకోవడం వల్ల ఎంపికయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే తిరుమలలో నేరుగా రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీ అదృష్టం కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆన్లైన్ కంటే ఆఫ్‌లైన్ విధానంలో తక్కువ మంది పోటీ పడతారు కాబట్టి, సేవల్లో పాల్గొనే భాగ్యం త్వరగా లభిస్తుంది. తిరుమలకు వెళ్లినప్పుడు లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవడం మంచిది.


