News June 13, 2024
అజిత్ దోవల్ మూడోసారి నియామకం

జాతీయ భద్రతా సలహాదారు(NSA)గా వరుసగా మూడోసారి అజిత్ దోవల్ నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాలపై అపారమైన అనుభవం ఉన్న దోవల్ 2014 నుంచి జాతీయ భద్రతా సలహాదారుగా కొనసాగుతున్నారు.
Similar News
News November 17, 2025
పైరసీ సైట్లను ఎంకరేజ్ చేయవద్దు: సజ్జనార్

TG: ఐబొమ్మ రవి సినిమాలను పైరసీ చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశాడని HYD CP సజ్జనార్ తెలిపారు. ‘రవిని పోలీస్ కస్టడీకి కోరాం. విచారణలో పూర్తి వివరాలు రాబడతాం. పైరసీ చేసినా, చూసినా నేరమే. యూజర్ల డివైజ్‌లలోకి మాల్వేర్ పంపి వ్యక్తిగత డేటా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఇలాంటి సైట్లను ఎంకరేజ్ చేయవద్దు’ అని సూచించారు.
News November 17, 2025
20న బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం

బిహార్ సీఎంగా మరోసారి నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న పట్నాలోని గాంధీ మైదానంలో కార్యక్రమం ఉంటుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ప్రకటించారు. అదే రోజు మంత్రుల ప్రమాణం ఉంటుందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
News November 17, 2025
సౌదీ బస్సు ప్రమాదం.. హెల్ప్‌లైన్ ఏర్పాటు

సౌదీలో జరిగిన ఘోర బస్సు <<18309348>>ప్రమాదంపై<<>> విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలో కాన్సులేట్లు బాధిత కుటుంబాలకు అండగా ఉంటాయన్నారు. మరోవైపు కేంద్రం హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఏదైనా సమాచారం కోసం 8002440003, 0122614093, 0126614276, +966556122301 నంబర్లను సంప్రదించాలని సూచించింది.


