News January 11, 2025

కారు రేసు నుంచి తప్పుకొన్న అజిత్

image

దుబాయ్‌లో జరిగే కార్ రేసులో పాల్గొనడం లేదని నటుడు అజిత్ ప్రకటించారు. ఇటీవల జరిగిన ప్రాక్టీస్ రేసులో ఆయన కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో కారు రేసు నుంచి తాను వైదొలగుతున్నట్లు తెలిపారు. తన టీమ్ పోటీలో కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు.

Similar News

News January 17, 2026

నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<>NML<<>>) 22 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT)ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.36వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nml.res.in/

News January 17, 2026

తిరుమల సప్తగిరులకు ఆ పేర్లెలా వచ్చాయంటే..?

image

తిరుమలలోని 7 కొండలకు విశిష్టమైన చరిత్ర ఉంది. శ్రీవారి ఆజ్ఞతో గరుత్మంతుడు తెచ్చిన గరుడాద్రి, వృషభాసురుడి పేరున వృషభాద్రి, అంజనీదేవి తపస్సు చేసిన అంజనాద్రి ప్రధానమైనవి. తొలిసారి తలనీలాలు సమర్పించిన నీలాంబరి పేరుతో నీలాద్రి, ఆదిశేషుడి పేరిట శేషాద్రి, పాపాలను దహించే వేంకటాద్రి, నారాయణుడు తపస్సు చేసిన నారాయణాద్రిగా నేడు వీటిని పిలుస్తున్నారు. ఈ ఏడు కొండలు భక్తికి, ముక్తికి నిలయాలు.

News January 17, 2026

టాస్ ఓడిన భారత్

image

U-19 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం వల్ల టాస్ కాస్త ఆలస్యమైంది. తొలుత భారత్‌దే బ్యాటింగ్ కావడంతో వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, కుందు చెలరేగితే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.
IND: ఆయుష్ మాత్రే(C), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్, విహాన్, కుందు, చౌహాన్, పంగాలియా, అంబరీష్, హెనిల్, దీపేశ్, ఖిలాన్ పటేల్