News February 6, 2025
అజిత్ ‘పట్టుదల’ పబ్లిక్ టాక్
అజిత్, త్రిష కాంబినేషన్లో తెరకెక్కిన ‘విదాముయార్చి’(పట్టుదల) మూవీ ప్రీమియర్ షోలు యూఎస్‌లో మొదలయ్యాయి. ఈ యాక్షన్ సినిమా ఫస్టాఫ్ స్లోగా మొదలైనా ట్విస్టులు, కమర్షియల్ ఎలిమెంట్లు బాగున్నాయని పలువురు పోస్టులు చేస్తున్నారు. అజిత్ నటన, అనిరుధ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. కొన్ని సీన్లలో దర్శకుడు కాస్త తడబడినట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
Similar News
News February 6, 2025
‘భక్త ప్రహ్లాద’కు 93 ఏళ్లు
తెలుగులో తొలి టాకీ సినిమాగా గుర్తింపు పొందిన ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి 93 ఏళ్లు పూర్తయ్యాయి. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రూ.18 వేలతో 18 రోజుల్లోనే తెరకెక్కించారు. అప్పటివరకు మూకీ చిత్రాలకే అలవాటైన జనాలకు ఇది కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెను మార్పులు చోటుచేసుకొని అంతర్జాతీయ వేదికపై సత్తాచాటే స్థాయికి చేరుకున్నాయి.
News February 6, 2025
స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్
ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. CTకి 15 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న అతడు అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 71 వన్డేలు ఆడి 1,495 పరుగులు చేశారు. ఒక సెంచరీతో పాటు 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. మొత్తం 48 వికెట్లు తీశారు.
News February 6, 2025
బీఆర్ఎస్ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలి: షబ్బీర్ అలీ
TG: కులగణన సర్వే నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలన్నారు. ప్రజల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. సర్వే పేరుతో రూ.100 కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. విచారణ జరిగితే అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.