News May 1, 2024
అజిత్‌కు భార్య షాలినీ సర్‌ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ బర్త్ డే సందర్భంగా ఆయన భార్య షాలినీ స్పెషల్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. అజిత్‌కి బైక్స్ అంటే బాగా ఇష్టం కావడంతో లేటెస్ట్ మోడల్ డుకాటీ బైక్‌ని భర్తకు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అజిత్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ, విదా ముయార్చి సినిమాలు చేస్తున్నారు.
Similar News
News January 18, 2026
హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో ఇంటర్న్‌షిప్

DRDOకు చెందిన హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో 40 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE/BTech 7, 8వ సెమిస్టర్, MTech ఫస్ట్ ఇయర్/ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in
News January 18, 2026
బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదు రాజకీయాలు: CM CBN

AP: రాజకీయాలు చేయడం అంటే బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదని CM చంద్రబాబు అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉన్నది NDA ప్రభుత్వం, CBN అని గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. TDP కుటుంబ సభ్యుల కృషితోనే తాను సీఎం అయ్యానని తెలిపారు. అధికారం కోసం ఏనాడు ఆరాటపడలేదన్నారు. గొంతు మీద కత్తి పెట్టి TDPని విడిచిపెట్టమంటే ప్రాణాలు వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారని NTR 30వ వర్ధంతి కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
News January 18, 2026
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.


