News June 23, 2024
బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్‌గా మళ్లీ ఆకాశ్ ఆనంద్

బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) జాతీయ సమన్వయ కర్తగా మరోమారు ఆకాశ్ ఆనంద్‌ను ఆ పార్టీ చీఫ్ మాయావతి నియమించారు. తన మేనల్లుడైన ఆకాశ్‌ను లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆమె తప్పించిన సంగతి తెలిసిందే. అతడికి మరింత పరిపక్వత అవసరమని, ఆ స్థానంలో తన సోదరుడు ఆనంద్ కొనసాగుతారని ఆమె అప్పట్లో చెప్పారు. ఇది జరిగిన వారాల వ్యవధిలోనే మళ్లీ ఆకాశ్‌కే ఆమె ఆ పదవిని కట్టబెట్టడం ఆసక్తికరంగా మారింది.
Similar News
News November 4, 2025
శబరిమల యాత్రికులకు రూ.6కోట్లతో ఆస్పత్రి

శబరిమల యాత్రికుల కోసం రూ.6.12కోట్లతో కేరళ ప్రభుత్వం ఓ ఆస్పత్రిని నిర్మించబోతోంది. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నీలక్కల్ వద్ద నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో స్థానికులకూ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తామని హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ పేర్కొన్నారు. హాస్పిటల్ నిర్మాణానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భూమి కేటాయించిందని వెల్లడించారు. ఇందులో ఎమర్జెన్సీ, ICU, ECG విభాగాలుంటాయని తెలిపారు.
News November 4, 2025
దీపావళి, కార్తీక పౌర్ణమి రోజుల్లో బాణాసంచా ఎందుకు కాల్చుతారు?

భాద్రపద మాసంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వర్షాల కారణంగా భూమిపై విషపూరితమైన ఆవిరి పేరుకుపోతుంది. ఈ కలుషిత గాలిని పీల్చడం వలన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పర్వదినాల్లో పసుపు, గంధకం, సురేకారం వంటి ద్రవ్యాలతో తయారుచేసే బాణాసంచాను కాల్చుతారు. వీటి నుంచి వచ్చే విపరీత కాంతి, పెద్ద ధ్వని, పొగ.. ఇవన్నీ క్రిమి సంహారిణిగా పనిచేసి, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది.
News November 4, 2025
‘ప్రతి కదలికలో పరమేశ్వరుడిని చూడాలి’

జీవితంలో ప్రతి అంశాన్ని దైవారాధనగా భావించి, ప్రతి క్షణం పరమాత్మలో లీనమై జీవించడమే మానవ జీవిత లక్ష్యమని ‘భక్తి యోగం’ పేర్కొంది. ‘ఓ దేవా! నా ఆత్మ నీవే, నా బుద్ధియే పార్వతి. నా శరీరమే నీ గృహం. నా పంచప్రాణాలు నీ పరిచారకులు. నా ప్రతి అనుభవం నీకు చేసే పూజే. నా నిద్ర కూడా యోగ సమాధితో సమానం. నేను నడిచే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణం. నేను పలికే ప్రతి మాట నీ స్తోత్రం’ అంటూ పరమాత్మను సేవించాలని సూచిస్తోంది.


