News February 8, 2025
శివరాత్రికి అఖండ-2 ఫస్ట్ లుక్?

బోయపాటి డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా అఖండ-2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే మహాకుంభమేళాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం నుంచి బాలయ్య ఫస్ట్ లుక్‌ను ఈ నెలాఖరున విడుదల చేస్తారని సమాచారం. ఈ మూవీలో సంయుక్తా మేనన్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News December 2, 2025
APPLY NOW: IIBFలో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్& ఫైనాన్స్(IIBF) 10 Jr ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్‌మెంట్/IT/CS/కంప్యూటర్ అప్లికేషన్), డిప్లొమా(IIBF), M.Com/MA/MBA/CA/CMA/CFA ఉత్తీర్ణులు అర్హులు. గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. www.iibf.org.in
News December 2, 2025
PCOSని తగ్గడానికి ఏం చేయాలంటే?

మంచి జీవనశైలిని పాటిస్తూ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నారంటే పీసీఓఎస్ అదుపులోకి వస్తుందని.. అప్పుడు గర్భం ధరించే అవకాశం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ శారీరక శ్రమ, తగినంత నిద్రతో పాటు రోజూ ఒకే సమయానికి ఆహారం తినడం కూడా కీలకం. ముఖ్యంగా విటమిన్ బి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. కొందరిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ బరువు కంట్రోల్లోనే ఉంటుంది. దీన్ని లీన్ పీసీఓఎస్ అంటారు.
News December 2, 2025
PCOS ఉంటే వీటికి దూరంగా ఉండాలి

PCOS ఉన్నవారు బెల్లం, పంచదార, తేనె, తీపి, మైదా, బేకరీ ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. 1.5 శాతం మాత్రమే కొవ్వు ఉండే పాలు, పెరుగు తీసుకోవాలి. వంటల్లో నూనె తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇవన్నీ క్రమం తప్పకుండా పాటించడం వల్ల PCOS, ఇన్సులిన్ స్థాయులు అదుపులోకి వస్తాయి. దీంతో గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.


