News June 7, 2024
హిందూపురంలో ‘అఖండ 2’ ఓపెనింగ్?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘అఖండ 2’ మూవీపై ఇంట్రెస్టింగ్ రూమర్ వైరల్ అవుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలను హిందూపురంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైనట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. షూటింగ్ కోసం అరకు, కొచ్చి లాంటి ప్రదేశాలను మూవీ యూనిట్ పరిశీలించినట్లు టాక్. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు.
Similar News
News November 29, 2024
3 గంటలకు పైగా రన్ టైమ్ ఉన్న చిత్రాలివే..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ రన్ టైమ్ 3 గంటలకుపైనే అని తెలుస్తోంది. తెలుగులో అత్యధిక రన్ టైమ్ కలిగిన చిత్రంగా దానవీరశూరకర్ణ(3.46 గం.) ఉంది. ఆ తర్వాత లవకుశ(3.28 గం.), పాండవ వనవాసం(3.18గం.), పాతాళ భైరవి(3.15గం.) వంటి చిత్రాలు నిడివి ఎక్కువగా ఉండి అప్పట్లో సంచలనాలు సృష్టించాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన అర్జున్ రెడ్డి, RRR వంటి సినిమాల రన్ టైమ్ 3 గంటలకుపైనే కావడం గమనార్హం.
News November 29, 2024
మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం!
TG: కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం ఇవ్వనున్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో టీపీసీసీ తీర్మానం చేసింది. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టభద్రుల స్థానాన్ని నిలుపుకోవాలని నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.
News November 29, 2024
ధరణి సమస్యల పరిష్కార బాధ్యత వారిదే..
TG: ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి బాధ్యత అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలదేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్లికేషన్ల పరిష్కారానికి తహశీల్దార్‌కు 7 రోజులు, ఆర్డీవోకు 3 రోజులు, అదనపు కలెక్టర్‌కు 3 రోజులు, కలెక్టర్‌కు 7 రోజుల గడువు ఇచ్చింది. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించింది.