News September 23, 2025
డిసెంబర్ 5న ‘అఖండ-2’ విడుదల: బాలకృష్ణ

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’ సినిమా విడుదల తేదీపై హీరో నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎల్లుండి తమ్ముడు పవన్ OG మూవీ విడుదలవుతోంది. డిసెంబర్ 5న అఖండ-2 రాబోతోంది. పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో తీసుకొస్తున్నాం. హిందీ డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చిందని బోయపాటి చెప్పారు. అన్ని భాషల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News September 23, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ తిరుమల శ్రీవారికి కానుకగా 535 గ్రాముల బంగారు అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని (విలువ రూ.60 లక్షలు) అందజేసిన BJP MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి
☛ రేపు HYD నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద BRS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
☛ ‘గ్రూప్-1’ ఫలితాలు రద్దు చేయాలన్న తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలు.. తీర్పును కొట్టివేయాలని ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి విజ్ఞప్తి.. విచారణకు స్వీకరించిన కోర్టు
News September 23, 2025
మైథాలజీ క్విజ్ – 14 సమాధానాలు

1. రామాయణంలో వాలి కుమారుడు ‘అంగదుడు’.
2. వ్యాసుని ద్వారా దాసి కన్న బిడ్డ ‘విదురుడు’.
3. అత్రి మహాముని భార్య ‘అనసూయ’. ఈ దంపతుల కుమారుడే దత్తాత్రేయుడు.
4. కామాఖ్య దేవాలయం ‘అస్సాం’ రాష్ట్రంలో ఉంది.
5. శ్రీరామనవమి ‘చైత్ర మాసం’లో వస్తుంది.
<<-se>>#mythologyquiz<<>>
News September 23, 2025
PHOTO GALLERY: అమ్మవారి వైభవం

తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో వెలిగిపోతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఆ జగన్మాత ఆశీస్సులు పొందుతూ పరవశించి పోతున్నారు. పలు జిల్లాల్లో అమ్మవారి అలంకారాలను ఫొటోల్లో వీక్షించి తరించండి.