News April 5, 2025

ఈ నెల 8న అఖిల్ మూవీ అప్డేట్

image

కొత్త దర్శకుడు మురళీ కిషోర్, అక్కినేని అఖిల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం నుంచి అప్డేట్ రానున్నట్లు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. అఖిల్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారని సమాచారం. దీనికి ‘లెనిన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అఖిల్ చివరి చిత్రం ‘ఏజెంట్’ రిలీజై రెండేళ్లు కావొస్తోంది.

Similar News

News April 6, 2025

తెలంగాణ కొత్త సీఎస్ ఆయనేనా?

image

TG: సీఎస్ శాంతికుమారి ఈనెలాఖరున రిటైర్ కానున్న నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఐఏఎస్ రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని CM రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. ఆర్థిక శాఖలో సుదీర్ఘ అనుభవం, రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండడంతో ఆయనవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు శాంతికుమారి వీఆర్ఎస్ తీసుకుంటారని, ఆమెకు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News April 6, 2025

ఈ నెల 30 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం

image

చార్ ధామ్ యాత్ర ఈ నెల 30నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనుండగా వచ్చే నెల 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ గుళ్లను తెరుస్తారు. భక్తుల రక్షణార్థం 6వేలకు పైగా పోలీసుల్ని, భద్రతాసిబ్బందిని అధికారులు ఏర్పాటు చేయనున్నారు. 10 కి.మీకి ఒక సెక్టార్ చొప్పున 137 సెక్టార్లుగా యాత్ర మార్గాన్ని విభజించామని నిరంతరం భద్రతాసిబ్బంది గస్తీ తిరుగుతుంటారని వారు స్పష్టం చేశారు.

News April 6, 2025

గుజరాత్‌తో సన్‌రైజర్స్ ఢీ.. గెలుపెవరిదో!

image

IPLలో ఈరోజు రాత్రి 7.30 గంటలకు గుజరాత్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న SRH సొంత గ్రౌండ్‌లో మళ్లీ గాడిన పడాలని చూస్తోండగా వరుస విజయాల జోరును కొనసాగించాలని GT భావిస్తోంది. SRH టీమ్ బ్యాటింగ్‌లో క్లిక్ అవ్వకపోగా బౌలింగ్‌లో వికెట్లూ తీయలేకపోతోంది. ఫీల్డింగ్‌లోనూ పేలవంగానే కనిపిస్తోంది. మరోవైపు GT బలంగా ఉంది. మరి ఈరోజు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

error: Content is protected !!