News October 27, 2024

MVA తీరుపై అఖిలేశ్ అసంతృప్తి

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి మ‌హావికాస్ అఘాడీ కూట‌మి తీరుపై SP చీఫ్ అఖిలేశ్ కినుక వహించారు. తమకు సీట్ల కేటాయింపులో కూటమి పార్టీలు జాప్యం చేస్తున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. SP పోటీ చేయాల‌ని భావిస్తున్న ధులె సీటుకు శివ‌సేన UBT అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డాన్ని పార్టీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు అబు అజ్మీ త‌ప్పుబ‌ట్టారు. 5 సీట్లు ఇవ్వ‌క‌పోతే 20 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామ‌ని తెలిపారు.

Similar News

News October 27, 2024

విజయసాయి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారే: షర్మిల

image

AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగినవారే అని PCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. జగన్ మాటలే ఆయన మాట్లాడుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘విజయసాయి గారూ, మీరు చదివింది జగన్ స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా? ఆస్తులు నలుగురు బిడ్డలకు చెందాలని YS నిర్ణయించారు. కాదని ఆయన చెప్పగలరా? ఎవరినో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఈ వైఎస్ బిడ్డకు ఎప్పటికీ రాదని మాట ఇస్తున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

News October 27, 2024

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: AP పోలీస్

image

AP: దీపావళి వేళ అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పుట్టపర్తిలో ఈమేరకు ఎస్పీ వి.రత్న ప్రకటన విడుదల చేశారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామగ్రిని టపాసుల విక్రయ దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని, అన్నింటికంటే ముఖ్యంగా లైసెన్సులు ఉన్నవారే విక్రయించాలని సూచించారు. పండుగ వేళ ఎక్కడైనా ప్రమాదాలు సంభవిస్తే వెంటనే 100 లేదా 112కు ఫోన్ చేయాలన్నారు.

News October 27, 2024

జగన్ ఓ విషపు నాగు: షర్మిల

image

AP: ఛార్జిషీట్‌లో వైఎస్ పేరు చేర్చిందే జగన్ అని పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు పొన్నవోలుతో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. ‘వైఎస్ మరణానికి చంద్రబాబు కారణమైతే ఐదేళ్లు అధికారంలో ఉండి గాడిదలు కాశారా? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? చంద్రబాబుతో నాకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. స్వప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకీడ్చిన విషపు నాగు జగన్’ అని ఆమె ట్వీట్ చేశారు.