News June 12, 2024

ఎమ్మెల్యే పదవికి అఖిలేశ్ రాజీనామా

image

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కన్నౌజ్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన ఆయన ఎంపీగా కొనసాగుతానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఫైజాబాద్ ఎంపీగా గెలుపొందిన పార్టీ సీనియర్ నేత అవధేశ్ ప్రసాద్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను శాసనసభ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి పంపారు. ఇటీవల యూపీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో SP 37 స్థానాలు గెలుచుకుంది.

Similar News

News December 16, 2025

టీచర్లకు బోధనేతర పనులొద్దు!

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని టీచర్లకు బోధనేతర పనులు కేటాయించొద్దని అధికారులకు విద్యాశాఖ కమిషనర్ వి.విజయరామరాజు ఆదేశాలిచ్చారు. టెన్త్ విద్యార్థులకు రోజూ స్లిప్ టెస్టులు నిర్వహించాలన్నారు. కాగా పాఠశాల స్థాయిలోనే క్వశ్చన్ పేపర్లు తయారుచేసే వెసలుబాటు కల్పించారు. గతేడాది వాటిని పైస్థాయి నుంచి పంపేవారు. ఉత్తీర్ణత శాతం పెంపు బాధ్యత కలెక్టర్ నియమించిన గెజిటెడ్ అధికారిపై ఉండనుంది.

News December 16, 2025

జింకు ఫాస్పేట్‌ ఎరతో ఎలుకల నివారణ

image

ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింకు ఫాస్పేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 20 గ్రాములు (98శాతం నూకలు, 2శాతం నూనె) పొట్లాలుగా చేసి ఎలుక కన్నానికి ముందు ఒకటి చొప్పున ఉంచాలి. ఇలా ఎలుకకు 2 రోజులు అలవాటు చేసి 3వరోజు జింకు ఫాస్పేట్ ఎరను 10 గ్రాములు (96% నూకలు, 2% నూనె, 2% మందు) పొట్లాలుగా కట్టి ఎలుక కన్నంలో ఒకటి చొప్పున వేయాలి. ఇవి తిన్న ఎలుకలు మరణిస్తాయి.

News December 16, 2025

HCLలో 64 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(HCL)లో 64 జూనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://www.hindustancopper.com/