News June 12, 2024

పవన్ ప్రమాణ స్వీకారానికి పంచెకట్టులో అకీరా

image

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన కుమారుడు అకీరా నందన్, ఆద్య మెరిశారు. అకీరా పంచెకట్టులో అచ్చతెలుగు కుర్రాడిలా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైనట్లు తెలుస్తోంది.

Similar News

News October 15, 2025

సిరి సంపదలకు పునాది ‘వాస్తు’

image

వాస్తు బాగున్న ఇంట్లో నివసిస్తే వారికి సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘మంచి వాస్తు వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభావవంతమైన ఆలోచనలు వస్తాయి. అవి అవకాశాలను సృష్టిస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. దీంతో మన జీవితంలో సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పడతాయి. ఇవే అంతిమంగా మనకు ఆనందాన్ని, సంతృప్తిని అందిస్తాయి. వాస్తే మన సౌభాగ్యానికి తొలి మెట్టు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News October 15, 2025

విప్లవం లేదు గిప్లవం లేదు: సీఎం మార్పుపై సిద్దరామయ్య

image

కర్ణాటక కాంగ్రెస్‌లో CM మార్పు అంశం నెలలో ఒక్కసారైనా తెరపైకి రావడం సర్వ సాధారణమైంది. ఇటీవల రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవంబర్‌లో విప్లవం (క్రాంతి) రాబోతోందని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్యను ఓ విలేకరి ప్రశ్నించగా ‘క్రాంతి లేదు భ్రాంతి లేదు’ అని కొట్టిపారేశారు. తానే సీఎంగా కొనసాగుతానని పునరుద్ఘాటించారు. నాయకత్వ మార్పుపై వచ్చేవన్నీ అసత్యాలేనని స్పష్టం చేశారు.

News October 15, 2025

బిహార్‌‌లో పురుష ఓటర్లదే ఆధిక్యం.. కానీ!

image

బిహార్‌‌లో పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 3.92 కోట్ల పురుష ఓటర్లు ఉండగా స్త్రీ ఓటర్లు 3.5 కోట్లు ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 892 మంది స్త్రీ ఓటర్ల నిష్పత్తి నమోదైంది. గత ఎన్నికల్లో (899) కన్నా ఇది తగ్గింది. స్త్రీలు తమ భర్తలు ఫారాలు తెచ్చినప్పుడే మాత్రమే ఓటర్లుగా నమోదవుతున్నారు. అయితే ఓటింగ్‌లో మాత్రం చురుగ్గా పాల్గొంటూ ఎన్నికల ఫలితాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని NDA పేర్కొంది.