News April 9, 2025
‘ఓజీ’లో అకీరా నందన్.. రేణూ దేశాయ్ స్పందనిదే

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీలో అకీరా నందన్ నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై నటి రేణూ దేశాయ్ ఓ పాడ్ కాస్ట్లో స్పందించారు. ‘అకీరా ప్రస్తుతం ఏ మూవీలోనూ నటించడం లేదు. ఆయన తండ్రి పవన్ నటిస్తున్న ‘ఓజీ’లోనూ ఆయన లేరు. ఒకవేళ అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే నేనే సోషల్ మీడియాలో ప్రకటిస్తా. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వార్తలన్నీ నిరాధారం’ అని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News April 17, 2025
పాతబస్తీలో మెట్రో.. చారిత్రక కట్టడాలకు నష్టం కలగొద్దు: హైకోర్టు

TG: పాతబస్తీ మెట్రో నిర్మాణ పనులపై నెలకొన్న అభ్యంతరంపై హైకోర్టులో విచారణ జరిగింది. మెట్రో నిర్మాణం వల్ల ఇక్కడి చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయని పిటిషన్ దాఖలైంది. దీంతో పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయొద్దని, వాటి వద్ద నిర్మాణ పనులు చేపట్టొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
News April 17, 2025
కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నాగర్కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వాన పడనున్నట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా నిన్న కూడా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి.
News April 17, 2025
సమంత ఫ్యాన్స్కు నిరాశ.. కారణమిదే!

‘సిటాడెల్’ ఇంగ్లిష్ సిరీస్ను భారత్లో ‘సిటాడెల్: హనీ- బన్నీ’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. వరుణ్ ధవన్, సమంత నటించిన ఈ సిరీస్కు సీక్వెల్ను రద్దు చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఇటాలియన్ వెర్షన్ ‘సిటాడెల్-డయానా’కు కూడా సీక్వెల్ ఉండదని తెలిపింది. ఒరిజినల్ సిరీస్(ఇంగ్లిష్)కు మాత్రమే కొనసాగింపుగా సీజన్-2ను తీసుకురానుంది. ప్రియాంక చోప్రా నటించిన సీజన్-2 2026లో రిలీజ్ కానుంది.