News September 23, 2025

‘OG’లో అకీరానందన్?

image

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలో ఆయన కుమారుడు అకీరానందన్ నటించినట్లు చర్చ జరుగుతోంది. కత్తిపై ఓ కుర్రాడి కళ్లు కనిపించగా.. అవి అకీరావేనని ఫ్యాన్స్ అంటున్నారు. కచ్చితంగా ఎంట్రీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ పక్కన రాహుల్ రవీంద్రన్ నటించగా ఎడిటింగ్‌లో ఆ పాత్రను తొలగించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అది దర్శకుడి నిర్ణయమని ఓ ఫ్యాన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

Similar News

News September 23, 2025

గ్రూప్2 స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు సూచన

image

AP: Group-2 పోస్టుల నియామకానికి సంబంధించి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లను రేపు 11AM లోగా సమర్పించాలని APPSC సూచించింది. నోటిఫికేషన్ తేదీకి పదేళ్ల ముందు జారీ అయిన పత్రాలను క్లెయిమ్ చేసేవారు వాటిని కమిషన్‌కు నేరుగా లేదా ఈ-మెయిల్‌ ద్వారా అందించవచ్చని పేర్కొంది. గడువులోగా అందిన పత్రాలను SAAP పరిశీలనకు పంపి తదుపరి చర్యలు చేపడతామంది. email id: appscgroup2services@gmail.com.

News September 23, 2025

GST 2.0పై కేంద్రానికి ఫిర్యాదుల వెల్లువ!

image

GST కొత్త శ్లాబులు అమలులోకి వచ్చినా కొన్ని ఇ-కామర్స్ సైట్స్ ప్రయోజనాలను బదిలీ చేయట్లేదని కేంద్రానికి ఫిర్యాదులొచ్చాయి. వీటిపై కేంద్రం ఆరా తీస్తోంది. ‘ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించలేం. అన్ని సైట్లలో ధరల మార్పులను గమనిస్తున్నాం. సెప్టెంబర్ 30 కల్లా ఓ నివేదిక వస్తుంది’ అని కేంద్రం తెలిపింది. మీకూ ఇలాంటి అనుభవమే ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1915, www.consumerhelpline.gov.inలో ఫిర్యాదు చేయొచ్చు.
ShareIt.

News September 23, 2025

YCP చేసేవి తప్పుడు ఆరోపణలు: TDP

image

AP: ప్రజాధనంతో CM చంద్రబాబు 70సార్లు, మంత్రి లోకేశ్‌ 77సార్లు, Dy.CM పవన్ 122సార్లు గన్నవరం-HYD స్పెషల్ ఫ్లైట్స్‌లో తిరిగారని YCP చేసిన ఆరోపణలను TDP మండిపడింది. ‘అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన వీరు నిజమైన ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిపై అభాండాలు వేయడం వారి దుష్ట సంస్కృతికి ఉదాహరణ. ఈ తప్పుడు ప్రచారాన్ని TDP ముక్తకంఠంతో ఖండిస్తోంది’ అని ట్వీట్ చేసింది.