News September 20, 2025

అక్షర్‌కు గాయం.. రేపటి మ్యాచులో ఆడతాడా?

image

ఒమన్‌తో మ్యాచులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రేపు పాక్‌తో జరిగే మ్యాచులో ఆడటంపై అనుమానాలున్నాయి. నిన్న బౌండరీ వద్ద క్యాచ్ కోసం ప్రయత్నిస్తుండగా అక్షర్ తలకు గాయమైంది. వెంటనే ఆయన మైదానాన్ని వీడారు. దీంతో ఆయన రేపటి మ్యాచులో పాల్గొంటారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ అక్షర్ దూరమైతే భారత్ ఇద్దరు స్పిన్నర్లతోనే (కుల్దీప్, వరుణ్) ఆడాల్సి వస్తుంది.

Similar News

News September 20, 2025

మనిషికి మద్యంతో సంబంధం ఇప్పటిది కాదు!

image

మనిషికి ఆల్కహాల్‌తో లక్షల ఏళ్ల క్రితమే సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవి చింపాంజీలు రోజూ ఒక బాటిల్ బీరు మోతాదులో పులిసిన పండ్లను తినేవని వారు గుర్తించారు. ఈక్రమంలో పూర్వీకుల నుంచే మనిషికి మద్యంపై ఆసక్తి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం, పండ్లలోని చక్కెర, ఆల్కహాల్ రెండూ ఆ చింపాంజీలకు ఆహార వనరులుగా ఉపయోగపడ్డాయి.

News September 20, 2025

ఎర్లీ మెనోపాజ్‌లో ఏం తినాలంటే..

image

ప్రతి మహిళకు మెనోపాజ్ సాధారణం. అయితే కొందరికి హార్మోన్ల ప్రభావం వల్ల ఎర్లీ మెనోపాజ్ వస్తుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. దీంతో జీవక్రియ సమస్యలు, థైరాయిడ్, మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే రాగి, జొన్నజావలు తీసుకోవాలి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉండే కూరగాయలు, పండ్లు, నట్స్ తినాలి. ప్రాసెసింగ్ ఫుడ్స్, చాక్లెట్లు, జంక్ ఫుడ్ తగ్గించాలి.

News September 20, 2025

పసుపు పంటలో నత్రజని లోపం-లక్షణాలు

image

పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండటం, భూమిలో క్షార, చౌడు గుణం కలిగి ఉండటం.. సమతుల, సమగ్ర ఎరువులు వాడకపోవడం పసుపు పంటలో నత్రజని లోపానికి ప్రధాన కారణం. దీని వల్ల ఆకులు పాలిపోయి ఆకుపచ్చ లేదా పసుపుపచ్చగా మారతాయి. పైరు కురచగా అవ్వడం, ఆకులు కొన నుంచి మధ్య వరకు మాడిపోవడం జరుగుతుంది. ఈ లోపం వల్ల కొమ్మల్లో పచ్చదనం తగ్గి ముదురు ఆకులు త్వరగా ఎండిపోతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.