News September 5, 2025
వరద బాధితులకు అక్షయ్ కమార్ రూ.5 కోట్ల సాయం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. పంజాబ్ వరద బాధితుల కోసం ఆయన రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. దీనిని ప్రజా సేవగా భావిస్తున్నానని, విరాళం అనుకోనని ఆయన తెలిపారు. కాగా వరద బాధితులకు ఇప్పటికే ప్రీతి జింటా-రూ.33 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు దిల్జిత్ దోసాంజ్, సోనమ్ బజ్వా, సంజయ్ దత్, సోనూ సూద్ తదితరులు పలు గ్రామాలను దత్తత తీసుకుంటామని వెల్లడించారు.
Similar News
News September 5, 2025
GST ఎఫెక్ట్.. టాటా కార్ల ధరలు తగ్గాయ్

GST తగ్గించిన నేపథ్యంలో SEP 22 నుంచి కార్ల ధరలను సవరిస్తున్నట్లు టాటా ప్రకటించింది. చిన్నకార్లపై రూ.75వేల వరకు, పెద్ద కార్లపై రూ.1.45లక్షల వరకు తగ్గింపు ఉండనుంది.
☛ చిన్నకార్లు: * టియాగో-రూ.75వేలు, * టిగోర్-రూ.80వేలు, * అల్ట్రోజ్-రూ.1.10లక్షలు
☛ కాంపాక్ట్ SUVలు: * పంచ్-రూ.85వేలు, * నెక్సాన్-రూ.1.55లక్షలు
☛ మిడ్ సైజ్ మోడల్: * కర్వ్-రూ.65వేలు
☛ SUVలు: * హారియర్-రూ.1.40లక్షలు, * సఫారీ-రూ.1.45లక్షలు
News September 5, 2025
నేను నిత్య విద్యార్థిని: చంద్రబాబు

AP: తల్లిదండ్రుల తర్వాత మనం గుర్తు పెట్టుకునేది ఉపాధ్యాయులనే అని CM చంద్రబాబు అన్నారు. ‘నేను కూడా టీచర్ కావాల్సింది. SVUలో లెక్చరర్‌గా చేరాలని వర్సిటీ వీసీ కోరితే MLA అవుతానని చెప్పా. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు నా జీవితంలో స్ఫూర్తి నింపారు. నేను నిత్య విద్యార్థిని. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటా. లోకేశ్ చదువు గురించి నా భార్యే చూసేది. ఆ క్రెడిట్ ఆవిడదే’ అని తెలిపారు.
News September 5, 2025
ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ (55) ఇవాళ ముంబైలో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సూర్యవంశీ, దృశ్యం, మర్దానీ వంటి చిత్రాల్లో సహాయ పాత్రలతో ఆశిష్ గుర్తింపు పొందారు. హిందీతో పాటు మరాఠీ, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. ఆశిష్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.