News October 20, 2024
TDP MLC అభ్యర్థులుగా ఆలపాటి, పేరాబత్తుల!
AP: రెండు పట్టభద్ర ఎమ్మెల్యే స్థానాలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(కృష్ణా-గుంటూరు), పేరాబత్తుల రాజశేఖర్(ఉ.గో) పేర్లను టీడీపీ అధిష్ఠానం ఖరారుచేసింది. వీరికి మద్దతు ఇవ్వాలని పవన్, పురందీశ్వరిని టీడీపీ స్టేట్ చీఫ్ పల్లా శ్రీనివాసరావు కోరారు. తమ పార్టీ నేతలతో చర్చించి ఒకట్రెండు రోజుల్లో అభిప్రాయం చెబుతామని వారు తెలిపినట్లు సమాచారం. వారు సానుకూలత వ్యక్తం చేయగానే పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.
Similar News
News January 3, 2025
‘టెట్’ తొలిరోజు ప్రశాంతం
TG: రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు తొలిరోజైన గురువారం ప్రశాంతంగా ముగిశాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాల్లో తొలిరోజు పరీక్షకు ఉదయం 72.25శాతం మంది, మధ్యాహ్నం 75.68శాతం మంది హాజరయ్యారు. ఈ నెల 20 వరకు 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2, 8, 9, 10, 18 తేదీల్లో పేపర్-1 పరీక్షని నిర్వహించనున్నారు.
News January 3, 2025
2097 స్కూళ్లలో విద్యార్థులు లేరు!
TG: దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్యలో రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. ఏకంగా 2097 స్కూళ్లలో పిల్లలే లేరని డీఐఎస్ఎఫ్ఏ విడుదల చేసిన నివేదిక(2023-2024) తేల్చిచెప్పింది. పశ్చిమ బెంగాల్(3254), రాజస్థాన్(2187) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లేని పాఠశాలలు 12,954 ఉండగా వాటిలో తెలంగాణలోనే 2వేల పైచిలుకు ఉండటం ఆందోళనకరం.
News January 3, 2025
ఈ నెల 28 నుంచి నాగోబా జాతర
TG: రాష్ట్రంలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత ఆ స్థాయిలో జరిగే కెస్లాపూర్ నాగోబా జాతర ఉత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఆలయంలో 150మంది ఆదివాసీ యువత రక్తదానం చేసి జాతరకు అంకురార్పణ చేశారు. నాగోబా జాతరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా గిరిజనులు తరలిరానున్నారు.