News March 14, 2025
అయ్యో లక్ష్యసేన్: సెమీస్‌కు చేరకుండానే ఇంటికి..

భారత యంగ్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుకు తెరపడింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ఆయన నిష్క్రమించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో తన కన్నా మెరుగైన ర్యాంకర్, చైనా ఆటగాడు లీ షి ఫెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. వరుసగా రెండు గేముల్లో 10-21, 16-21 తేడాతో పరాజయం పాలయ్యారు. ఆటలో అతడు ఏ దశలోనూ లయ అందుకోలేదు. 2022లో లక్ష్య ఇక్కడ ఫైనల్‌కు చేరడం గమనార్హం.
Similar News
News January 5, 2026
నందీశ్వరుడు శివుడి వైపే ఎందుకు చూస్తాడు?

శివాలయాల్లో నంది శివుడి వైపే చూస్తుంటాడు. ఇది ఏకాగ్రత, భక్తికి సంకేతం. ఆయన శివుడికి అత్యంత సన్నిహితుడైన ద్వారపాలకుడు. మనసులోని ఆలోచనలు అటు ఇటు తిరగకుండా ఎప్పుడూ దైవచింతనలోనే ఉండాలని నంది స్థితి మనకు బోధిస్తుంది. భక్తుల కోరికలను విన్నవిస్తూ, వారిని శివదర్శనానికి సిద్ధం చేసేందుకు ఆయన శివుడి వైపే చూస్తూ ఉంటారు. ఆయన చెవిలో కోరికలు చెబితే వాటిని ఆయన నేరుగా శివుడికి చేరవేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News January 5, 2026
ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News January 5, 2026
వంటింటి చిట్కాలు

* పసుపు, కారం, కరివేపాకు పొడిలాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికెడు ఇంగువ కలిపి పేపరు కవర్లలో భద్రం చేస్తే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి.
* బ్రెడ్ ప్యాకెట్లో బంగాళాదుంప ముక్కలు ఉంచితే ఆ బ్రెడ్ తొందరగా పాడవదు.
* ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి వాటిని కట్ చేసినపుడు చేతులకు వాటి వాసన పోదు. అప్పుడు చేతిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని కొంచెంసేపు శుభ్రంగా రుద్దికడిగితే వాసనలు పోతాయి.


