News August 26, 2024
తెలుగు రాష్ట్రాల్లోనే మద్యం ‘కిక్కు’ ఎక్కువ

TG: దేశంలో తెలుగు రాష్ట్రాల్లోనే మద్యం వినియోగం ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ విభాగం నిపెప్ వెల్లడించింది. తెలంగాణలో వార్షిక సగటు తలసరి వినియోగం రూ.1,623 ఉండగా, ఏపీలో రూ.1,306గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్ 1,245, ఛత్తీస్గఢ్ రూ.1,227, ఒడిశా రూ.1,156 ఉన్నాయి. మద్యంపై వస్తున్న ఆదాయం రాష్ట్రాలకు మూడో అతిపెద్ద ఆదాయవనరుగా ఉందని తెలిపింది. అత్యధికంగా గోవా 722% ఆదాయం పొందుతున్నట్లు పేర్కొంది.
Similar News
News October 23, 2025
ఓటీటీలోకి వచ్చేసిన ‘OG’

పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ‘OG’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.308 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.
News October 23, 2025
మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు

TG: వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో జరిగే <<17462157>>మేడారం<<>> జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జాతర జరిగే ప్రదేశాన్ని 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించనున్నట్లు అధికారులు తెలిపారు. 1,050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా 24 శాశ్వత, 20 తాత్కాలిక మొబైల్ టవర్లు, నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. 12 వేల మంది పోలీసులు జాతరలో విధులు నిర్వహిస్తారని సమాచారం.
News October 23, 2025
ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు: అనిత

AP: దక్షిణకోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున సహాయక బృందాలను సిద్ధంగా ఉంచామని హోంమంత్రి అనిత తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్లు వివరించారు. నెల్లూరు, PKS, KDP, TPT జిల్లాల్లో NDRF, SDRF బృందాలు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.