News April 28, 2024
ALERT: అనంతపురం@ 43.7

భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. దేశంలోనే నంద్యాలలో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. కర్నూలులో 44.5 అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే హాటెస్ట్ సిటీగా నంద్యాల నిలవడం గమనార్హం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News November 21, 2025
‘అరటి సాగుచేస్తున్న రైతులను ఆదుకోండి’

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరటి సాగుచేస్తున్న రైతులను వెంటనే ఆదుకోవాలని CPM నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నల్లప్ప, తదితర నాయకులు అరటి పంటలను పరిశీలించారు. గిట్టుబాటు ధర లేక అరటి సాగుచేస్తున్న రైతులు నష్టపోతున్నారని, వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
News November 21, 2025
అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన తీర్పు

గంజాయి సరఫరా, విక్రయాలకు పాల్పడిన ఐదుగురి ముఠాకు 10 ఏళ్లు జైలు శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. (గంగాధర్, స్వాతి, ప్రసాద్, షేక్ గౌసియా, షేక్ అలీ) నిందితులకు శిక్ష పడేలా కృషిచేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ జగదీశ్ అభినందించారు. షేక్ అలీ గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామం కాగా మిగిలిన నలుగురు అనంతపురానికి చెందినవారే.
News November 21, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.


