News April 28, 2024
ALERT: అనంతపురం@ 43.7
భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. దేశంలోనే నంద్యాలలో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. కర్నూలులో 44.5 అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే హాటెస్ట్ సిటీగా నంద్యాల నిలవడం గమనార్హం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News November 1, 2024
ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువు మండలం కొండకమర్లలో మెహెతాజ్ (36) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. ఆమెకు కొంతకాలంగా ఇర్ఫాన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ మరో వ్యక్తితో కూడా చనువుగా ఉందని అనుమానించిన ఇర్ఫాన్ రాత్రి ఆమెను హత్య చేశాడు. తానే చంపినట్లు శుక్రవారం పోలీసుల వద్ద వాంగ్మూలం ఇచ్చి లొంగిపోయాడు. ఓబులదేవరచెరువు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 1, 2024
వెపన్ మిస్ ఫైర్‌తో గాయపడ్డ అనంతపురం ఏఆర్ హెడ్ కానిస్టేబుల్?
అనంతపురం జిల్లాలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురయ్యారు. అనంతపురంలోని కలెక్టర్ ఆఫీస్‌లో గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఆయన వెపన్ క్లీన్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయింది. ఘటనలో ఆయన గాయపడ్డారు. సిబ్బంది వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 1, 2024
మొదటి రోజే 99 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి కావాలి: కలెక్టర్
నవంబర్ ఒకటో తేదీ 99% పింఛన్ల పంపిణీ పూర్తి కావాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. 2,66,137 మందికి రూ.114.27 కోట్ల మొత్తాన్ని 9561 మంది సిబ్బందితో శుక్రవారం ఉదయమే పంపిణీ ప్రారంభించనున్నామన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండవ రోజు పంపిణీ పూర్తి చేయాలన్నారు. పింఛన్ల పంపిణీకి సమయం పొడిగించడం జరగదన్నారు.