News March 21, 2025
ALERT: అల్లూరి జిల్లాకు వర్ష సూచన

భగ్గమంటున్న ఎండలు, ఉక్కబోతతో అల్లాడిన అల్లూరి జిల్లా వాసులకు APSDMA చల్లటి కబురు చెప్పింది. జిల్లాలో శనివారం వడగాలులు, ఆదివారం వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.
Similar News
News November 7, 2025
రేపు స్కూళ్లకు సెలవు లేదు: డీఈవోలు

AP: ఇటీవల ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు వరుస సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటికి బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఏలూరు, బాపట్ల, విశాఖలో స్కూళ్లు యథావిధిగా తెరుచుకోనున్నాయి. అలాగే DEC 13, FEB 14న కూడా పాఠశాలలు పనిచేయనున్నాయి. మీకూ రేపు స్కూల్ ఉందా? COMMENT
News November 7, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ఓటు ఇక్కడే.. వాళ్లిక్కడలేరు..!

ఓటింగ్ శాతం పెరిగితే, గెలుపు అవకాశాలను పెరుగుతాయని ప్రధాన పార్టీలు స్థానికంగాలేని ఓటర్ల కోసం వెతుకుతున్నాయి. ఎవరెవరు, ఎక్కడెక్కడ ఉంటున్నారని ఆరా తీస్తున్నారు. ఆయా ఫ్యామిలీ, బంధువులు, మిత్రులతో మాట్లాడి వారిని రప్పించడయ్యా.. ప్రయాణ ఖర్చులతో పాటు అదనపు డబ్బలిస్తాం. వాళ్లని ఇక్కడికి తీసుకురమ్మని డబ్బులిచ్చే పనిలో పడ్డారు. ‘ఎలక్షన్ టైమ్లో తప్ప మమ్మల్నెవరు పట్టించుకుంటారు’అని ప్రజలు అనుకుంటున్నారు.
News November 7, 2025
నల్గొండలో ర్యాగింగ్పై కలెక్టర్ ఆరా

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆరా తీశారు. ఆమె అదనపు కలెక్టర్, ఆర్డీఓతో కలిసి కళాశాలను సందర్శించారు. విద్యార్థులు, ప్రిన్సిపల్తో విడివిడిగా మాట్లాడిన కలెక్టర్, తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే, విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నట్లు చర్చల్లో తెలిసిందని ఆమె పేర్కొన్నారు.


