News March 21, 2025
ALERT: అల్లూరి జిల్లాకు వర్ష సూచన

భగ్గమంటున్న ఎండలు, ఉక్కబోతతో అల్లాడిన అల్లూరి జిల్లా వాసులకు APSDMA చల్లటి కబురు చెప్పింది. జిల్లాలో శనివారం వడగాలులు, ఆదివారం వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.
Similar News
News April 24, 2025
తారాబు జలపాతం వద్ద పెందుర్తి విద్యార్థి గల్లంతు

పెందుర్తిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి తారాబు జలపాతంలో గల్లంతైనట్లు ఎస్‌ఐ రమణ తెలిపారు. నలుగురు యువకులు గురువారం జలపాతానికి వచ్చినట్లు చెప్పారు. వీరిలో వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలుకి చెందిన గొన్నూరి కిషోర్ (22) జలపాతంలో ఈత కొడుతూ గల్లంతయ్యాడని తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా కిషోర్ ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు.
News April 24, 2025
చింతలపూడి: పరారీలో ఉన్న నలుగురి అరెస్ట్

కామవరపుకోట మండలంలో పాత నాటు సారా కేసులలో పరారీలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. జలపావారిగూడెంకు చెందిన జువ్వల సత్యవతి, వెంకటాపురానికి చెందిన రాజులపాటి దుర్గారావు, ఆడమిల్లికి చెందిన మిరియాల శరత్ కుమార్ (బెల్లం సరఫరా చేసిన వ్యక్తి), కొత్తగూడెంకి చెందిన రాచప్రోలు మల్లికార్జునరావులను అరెస్ట్ చేశామన్నారు. చింతలపూడి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారన్నారు.
News April 24, 2025
యూట్యూబ్‌లో అన్నమయ్య సంకీర్తనలు

తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు యూట్యూబ్ ద్వారా చేరువచేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంకీర్తనలను ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.