News September 23, 2024
ALERT..ఈ జిల్లాలో 4 రోజులు భారీ వర్షాలు
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం సాయంత్రం ఉమ్మడి జిల్లాలోని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడునున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాలో అధికారులు సూచించారు.
SHARE IT
Similar News
News October 5, 2024
జూరాలలో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి
జూరాల ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో శుక్రవారం 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ సూరిబాబు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 196 మెగావాట్లు, 229.586 ఎం యూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు 204.994 ఎంయూ ఉత్పత్తిని చేపట్టామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 434.580 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు.
News October 5, 2024
నాగర్ కర్నూల్: విద్యార్థినితో అసభ్య ప్రవర్తన
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినితో రికార్డ్ అసిస్టెంట్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. దీంతో విద్యార్థిని కుటుంబీకులు షీటీంను సంప్రదించారు. వారు కాలేజీకి చేరుకొని సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినితో లిఖితపూర్వక ఫిర్యాదు చేసుకున్నారు. పై అధికారులకు సమాచారం ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని షీ టీం అధికారి వెంకటయ్య తెలిపారు.
News October 5, 2024
MBNR: బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్‌లో బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగ్యనగరంలోని పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ఆవరణంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా భావిస్తున్నాను అని ఎంపీ అన్నారు. బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలు అరుణమ్మను సన్మానించారు.