News November 1, 2024

ALERT: ఈ రైళ్లు విజయవాడలో ఆగవు

image

ప్రయాణికుల రద్దీ మేరకు రాయనపాడు మీదుగా సికింద్రాబాద్(SC), సత్రాగచ్చి(SRC) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 1,8, 15 తేదీలలో SRC- SC(నం.08845), నవంబర్ 2, 9,16 తేదీలలో SC- SRC(నం.08846) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడలో ఆగవని సమీపంలోని రాయనపాడు స్టేషన్‌లో ఆగుతాయన్నారు.

Similar News

News December 4, 2024

ఎన్టీఆర్: వైసీపీ నేత విద్యాసాగర్ కేసులో తీర్పు రిజర్వ్ 

image

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కేసును బుధవారం హైకోర్టు విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసు తీర్పును ఈనెల 9న ఇస్తామని పేర్కొంది. విద్యాసాగర్ 76 రోజులుగా జైలులో ఉన్నాడని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. బెయిల్ ఇస్తే నిందితుడు విద్యాసాగర్ కేసును ప్రభావితం చేస్తారని నటి కాదంబరి తరఫు లాయర్ పేర్కొన్నారని తాజాగా సమాచారం వెలువడింది. 

News December 4, 2024

పశువుల ఆశ్రయ నిర్మాణాలు ఆవశ్యకం: DK బాలాజీ

image

హోమ్ మంత్రి అనిత బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు జిల్లాలోని లంక గ్రామాలలో పశువుల ఆశ్రయ నిర్మాణాలు నిర్మించాలని బాలాజీ వీడియో కాన్ఫరెన్సులో తెలిపారు. విపత్తులు సంభవించినప్పుడు పశు నష్టం జరగకుండా ఈ భవనాలు ఉపయుక్తంగా ఉంటాయని బాలాజీ వివరించారు.

News December 4, 2024

రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సన్నద్ధం చేస్తున్నాం: కలెక్టర్ 

image

ఈనెల 6 నుండి జిల్లాలో రెవెన్యూ సదస్సులను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ జి. లక్ష్మిశ తెలిపారు. అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేలా ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రజలకు ముందుగానే తెలియపరిచేలా సదస్సుల షెడ్యూల్‌ను కరపత్రాల రూపంలో ముద్రించామన్నారు.